MLA Lasya Nanditha : కారు ప్రమాదంలో దుర్మరణం పాలైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
లాస్య నందిత కారు ఆమె ముందున్న ట్రక్కు రెయిలింగ్‌ను ఢీకొట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు
MLA Lasya Nanditha : బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత(Lasya Nanditha) రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తెలంగాణలో కలకలం రేపింది. ఇంకా తెల్లవారుజాము కావడంతో ప్రమాద వివరాలు ఇంకా తెలియరాలేదు. కారును క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత పోలీసులు ఓ అంచనాకి వచ్చారు. ఈ క్రమంలో ఈ కేసులో ఓ ట్విస్ట్ బయట పడింది. కారు అదుపు తప్పి రెయిలింగ్‌ను ఢీకొనడంతోనే ఇలాంటి ఘోర ప్రమాదం జరిగిందని అందరూ భావిస్తున్నారు. అయితే ఇటీవల కారును తనిఖీ చేసిన పోలీసులు ఇంత ఘోర ప్రమాదం కేవలం రెయిలింగ్ ఢీకొనడం వల్లే సంభవించలేదని తేల్చారు.
MLA Lasya Nanditha No More
లాస్య నందిత కారు ఆమె ముందున్న ట్రక్కు రెయిలింగ్‌ను ఢీకొట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. వేగంగా వచ్చిన కారు ఎదురుగా ఉన్న కారును ఢీకొట్టినట్లు ఆధారాలు లభించాయి. కారు బానెట్ పైభాగం పూర్తిగా ధ్వంసమైంది. కారు ముందు ఎడమ చక్రం కూడా తీవ్రంగా దెబ్బతింది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో కారు స్ట్రక్ అయినట్టు పోలీసులు నిర్ధారించారు. నందిత కారు బానెట్ పైభాగంలో ఉన్న ఇసుక గుర్తులను పోలీసులు సేకరించారు. ఔటర్ రింగ్ రోడ్డు రెయిలింగ్‌ను ఢికొనడం వల్ల ఇంత ప్రమాదం జరిగి ఉండకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
Also Read : TDP-Janasena Alliance: ఫిబ్రవరి 28న టీడీపీ, జనసేన ఉమ్మడి బహిరంగ సభ !