JD Lakshminarayana : తాను పోటీ చేసేది విశాఖపట్నం నుంచే అంటున్న జేడీ
అవినీతి, డ్రగ్స్, గూండాయిజం, ప్రకృతి విధ్వంసం లేని ఆంధ్రప్రదేశ్‌ను సాధించడమే తమ లక్ష్యమని వివి లక్ష్మీనారాయణ అన్నారు
JD Lakshminarayana : జై భారత్ నేషనల్ అధ్యక్షుడు వివి లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ కేంద్రం మెడలు వంచి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ ఏపీని సొంత లాభాలకోసం కేంద్రానికి తాకట్టు పెట్టిందని అన్నారు. 25 మంది ఎంపీలు గెలిచినా రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు సాధించడంలో ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళంలో జై భారత్ జాతీయ పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేసారు. అవినీతి, డ్రగ్స్, గూండాయిజం, ప్రకృతి విధ్వంసం లేని ఆంధ్రప్రదేశ్‌ను సాధించడమే తమ లక్ష్యమని వివి లక్ష్మీనారాయణ(JD Lakshminarayana) అన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌కు హక్కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మోసం చేసారని మండిపడ్డారు. చిన్న పార్టీలతో కలిసి అన్ని రంగాల్లోనూ పోటీ పడి ఫ్రంట్‌గా ఏర్పడి అన్ని స్తనాలనుంచి పోటీ చేస్తామని అన్నారు. తాను విశాఖపట్నం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు.
JD Lakshminarayana Comment
“సీఏఏ చట్టం, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక సమయంలోనూ, ఢిల్లీ చట్టం సమయంలోనూ వ్యతిరేకించి ఉంటే ఆయనకు ప్రత్యేక హోదా ఇచ్చేవారు.. ఎన్నికల సమయంలో మాత్రం ప్రత్యేక హోదా.. కొత్త డ్రామా మొదలవుతోంది.. ఈ పదవికి అడ్డంకి లేదు’’ అని 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్.కె.సింగ్ అన్నారు.ప్రత్యేక హోదా సాధించడమే మా ప్రధాన కర్తవ్యం.. మార్చి 1న చలో తాడేపల్లి ప్యాలెస్‌కు మద్దతు ఇస్తున్నాం. విద్యార్థులచేత.. ఈ ఉద్యమం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా కేంద్ర స్థాయిలో కూడా ఉధృతం కావాలి.. కాపు ఉద్యమమే ఒక ఉదాహరణ.. ‘‘ఈరోజు తాడేపల్లిలో జరిగే సదస్సులో పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రకటన చేయాలి” అని వివి లక్ష్మీనారాయణ అన్నారు.
Also Read : CM YS Jagan: అభ్యర్థుల ఎంపిక పూర్తయింది – సీఎం జగన్