CM Revanth Reddy : ‘ఇందిరమ్మ ఇల్లు’ పథకానికి నాంది పలికిన ముఖ్యమంత్రి
ఐదో పథకం ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా అమలులోకి వచ్చింది
CM Revanth Reddy : భద్రాచలంలో ఇందిరమ్మ ఇంటి పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రాములవారు కొలువైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి(Revanth Reddy) ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీల్లో ఇందిరమ్మ ఇల్లు ఐదోది. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రేవంత్ సర్కార్ నాలుగు పథకాలను అమలు చేసింది.
CM Revanth Reddy Started..
ఐదో పథకం ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా అమలులోకి వచ్చింది. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భాటి విక్రమార్క, మంత్రి తుమ్మల, మంత్రి పొంగులేటి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రి సీతక్క, మంత్రి కొండా సురేఖ, మంత్రి శ్రీధర్‌బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కూనంనేని, తెల్లం వెంకటరావు, కోరం కనకయ్య, రాగమయి, జాలె ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
Also Read : Hyderabad : భాగ్య నగరంలో మొదలైన నీటి కష్టాలు..ట్యాంకర్ల కోసం ఎదురు చూస్తున్న ప్రజలు