Nara Chandrababu Naidu: వైసీపీ డీఎన్‌ఏ లోనే శవరాజకీయం ఉంది – చంద్రబాబు

వైసీపీ డీఎన్‌ఏ లోనే శవరాజకీయం ఉంది - చంద్రబాబు

Nara Chandrababu Naidu: వైసీపీ డీఎన్ఏలోనే శవ రాజకీయం ఉందని టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) ఆరోపించారు. తండ్రి లేరు.. బాబాయ్‌ని చంపారంటూ జగన్‌ ఓట్లు అడిగారు. రక్తంలో మునిగిన వైకాపాకు ఓట్లు వేయవద్దని అతని చెల్లి కోరుతున్నారు. శవ రాజకీయాలు చేయడం సీఎం జగన్, అతని పార్టీ వైసీపీకు అలవాటుగా మారిందన్నారు. పెన్షన్ల పేరుతో శవరాజకీయాలు చేస్తూ… ముసలివారిని చంపేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రశ్నిస్తే గొడ్డలిని చూపి బెదిరిస్తున్నారు. మీ (వైసీపీ) పార్టీకి గొడ్డలి గుర్తు పెట్టుకోండి… కానీ, రాష్ట్రాన్ని శ్మశానం చేయొద్దు అని హితవు పలికారు.

కొవ్వూరులో ‘ప్రజాగళం’ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన సీఎం జగన్(Jagan), వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రిని రిలయన్స్ వారే చంపేశారని జగన్ ఓ సమయంలో అన్నారని… మళ్లీ వారికే ఎంపీ సీటు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. 2019లో తన బాబాయ్ వివేకానంద రెడ్డిని హత్య చేసి శవ రాజకీయాలు చేసి గెలిచారని విమర్శించారు. మొదట కోడి కత్తి డ్రామా, తర్వాత హు కిల్డ్ బాబాయ్ అని సెటైర్లు వేశారు.

Nara Chandrababu Naidu Comment

వలంటీర్ వ్యవస్థకు తాను వ్యతిరేకం కాదన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటీర్లను కొనసాగిస్తానని స్పష్టం చేశారు. వలంటీర్లు రాజకీయాలు చేయొద్దని సూచించారు. కొంతమంది వైసీపీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు.
జగన్ సభలకు 1500 బస్సులను పెట్టి ప్రజలకు డబ్బులు ఇచ్చి తరలిస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్(Jagan) సభ ప్రారంభం కాగానే జనం వెళ్లిపోతున్నారని విమర్శించారు. రాజకీయం మారుతోందని.. జనంలో ట్రెండ్ మారిందని అన్నారు. ఈ ఎన్నికల్లో జగన్ బెండు తీయడం ఖాయమని ఎద్దేవా చేసారు. జగన్‌ కు ఇంత అహంకారం పనికిరాదన్నారు. ఆయన అహంకారంతో రాష్ట్రాన్ని అంధకారం చేశారని మండిపడ్డారు. పిల్లల భవిష్యత్తు నాశనం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల మనిషిని చెప్పారు. రాష్ట్రం బాగుకోసం జనంలోకి పవన్ వచ్చారని చెప్పారు. రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పోటీ చేస్తున్నారని గెలిపించాలని కోరారు. తాను ఎండలో ప్రజలు బాగుండాలని వచ్చానని అన్నారు.

తెదేపా కూటమి ప్రభుత్వం వచ్చాక సంపద సృష్టించి పేదలకు పంచుతాం. వంద రోజుల్లో గంజాయి, డ్రగ్స్‌, జే బ్రాండ్‌ మద్యం ఉండవు. ఇసుక కొరత ఉండదు. విద్యుత్‌ ఛార్జీలు పెరగవు. సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేస్తాం. రైతు కూలీల కోసం అవసరమైతే ప్రత్యేక కార్పొరేషన్‌ పెట్టి వారిని ఆదుకుంటామని హామీ ఇస్తున్నా. నేను టిడ్కో ఇళ్లు ఇస్తే.. ప్రజల్ని జగన్‌ ఇబ్బందులకు గురి చేశాడు. మా ప్రభుత్వం ఏర్పాటు కాగానే పేదలకు రెండు సెంట్ల భూమి ఇస్తాం. ఇప్పటికే ఇచ్చిన స్థలాల్లో ఇల్లు కట్టించి మీ రుణం తీర్చుకుంటా’’అని చంద్రబాబు చెప్పారు.

Also Read : Janasena Party: అవనిగడ్డ, రైల్వే కోడూరు అభ్యర్థుల్ని ప్రకటించిన జనసేన !

Leave A Reply

Your Email Id will not be published!