Prajwal Revanna: విదేశాలకు దేవెగౌడ మనవడు ! అసభ్యకర వీడియోలే కారణమా ?
విదేశాలకు దేవెగౌడ మనవడు ! అసభ్యకర వీడియోలే కారణమా ?
Prajwal Revanna: లోక్ సభ ఎన్నికల వేళ కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ప్రధాని దేవెగౌడ కంచుకోట అయిన హసన్ ఎంపీ సెగ్మెంట్ బరిలో ఉన్న ఆయన మనవడు ప్రజ్వల్ రేవణ్ణ ప్రస్తుతం విదేశాలకు వెళ్లారు. ఆదివారం ఉదయం బెంగళూరు నుంచి ఫ్రాంక్ ఫర్ట్కు బయల్దేరి వెళ్లారు. దీనికి ప్రధాన కారణం రేవణ్ణపై అసభ్యకర వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడమే ముఖ్యకారణంగా కనిపిస్తోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
Prajwal Revanna Videos Issue..
కర్ణాటకలోని హాసన్ ఎంపీ సెగ్మెంట్ బరిలో ఉన్న జనతాదళ్ (సెక్యులర్) అగ్రనేత దేవెగౌడ ప్రజ్వల్ రేవణ్ణకు(Prajwal Revanna) చెందిన అసభ్యకర వీడియోలు సోషల్ మీడియాలో వైలర్ గా మారుతున్నాయి. ముఖ్యంగా హసన్ జిల్లాలో ఇవి ఎక్కువగా ప్రచారంలోకి వచ్చాయి. రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ ఈ అంశంపై దర్యాప్తు చేసేందుకు సిట్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో శనివారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దీనిపై స్పందిస్తూ నిజానిజాలు తేల్చేందుకు సిట్ ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మహిళపై లైంగిక వేధింపుల కోణాన్ని కూడా దీనిలో దర్యాప్తు చేస్తామన్నారు.
అయితే రేవణ్ణ(Prajwal Revanna) పేరు చెడగొట్టగానికి నవీన్ గౌడ మరికొందరు కలిసి ఈ క్లిప్ లను వ్యాప్తి చేశారని జేడీఎస్-బీజేపీ ఎలక్షన్ ఏజెంట్ పూర్ణచంద్ర గౌడ ఇప్పటికే ఈసీకు ఫిర్యాదు చేశాడు. ఆ మార్ఫ్డ్ వీడియోను హసన్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో నవీన్ మరికొందరు ఓటర్లకు పంపించారన్నాడు. అంతేకాదు రేవణ్ణకు ఓటేయద్దని వారు కోరినట్లు పేర్కొన్నాడు.
హసన్ నియోజకవర్గం దేవెగౌడ కుటుంబానికి కంచుకోట లాంటిది. రాజకీయంగా స్థానిక పుట్టస్వామి కుటుంబంపై వీరిదే ఆధిపత్యం. 1994, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో పుట్టస్వామి హొళెనరసిపుర శాసనసభ స్థానం నుంచి పోటీ చేసినప్పటికీ… దేవెగౌడ పెద్ద కుమారుడు హెచ్.డి.రేవణ్ణ చేతిలో పరాజయం పాలయ్యారు. 2008, 2013 అసెంబ్లీ ఎన్నికల్లో పుట్టస్వామి కోడలు ఎస్.జి.అనుపమకూ ఓటమి తప్పలేదు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పుట్టస్వామి మనవడు శ్రేయస్ పటేల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయగా… 3,152 ఓట్ల తేడాతో రేవణ్ణ చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇరు కుటుంబాలకు చెందిన వారే మళ్లీ పోటీపడుతున్నారు.
Also Read : Arvinder Singh Lovely: ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి షాక్ ! కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్ లవ్లీ రాజీనామా !