Teluguism – TDP-BJP-JSP Alliance Manifesto: ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల !

ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల !

TDP-BJP-JSP:ఏపీ ఎన్నికలకు టీడీపీ, బీజేపీ, జనసేన, కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టోను మంగళవారం విడుదల చేసింది. ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల నేతలు దీన్ని ఆవిష్కరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ సిద్ధార్థ్‌ నాథ్‌ సింగ్‌ ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

TDP-BJP-JSP:

మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.
దీపం పథకం కింద ప్రతి ఇంటికి ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితం.
ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు అందజేత.
నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి.
యువతకు ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు.
ప్రతి ఇంటికీ ఉచిత కుళాయి కనెక్షన్‌. స్వచ్ఛమైన తాగునీటి సరఫరా.
‘తల్లికి వందనం’ కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం.
రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం.
ఆక్వారైతులకు రూ.1.50కే యూనిట్‌ విద్యుత్‌.
ప్రతి పేద కుటుంబానికి రెండు సెంట్ల ఇంటి స్థలం. నాణ్యమైన సామగ్రితో మంచి ఇంటి నిర్మాణం.
ఇసుక ఉచితం.
భూ హక్కు చట్టం రద్దు.
సముద్ర వేట విరామ సమయంలో మత్స్యాకారులకు రూ.20వేల సాయం.
బోట్ల మరమ్మతులకు ఆర్థిక సాయం.
చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు.
బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం.

Also Read :-Janasena Symbol: స్వతంత్ర అభ్యర్థులకు ‘గాజు గ్లాసు’ కేటాయించడంపై హైకోర్టులో విచారణ !

Leave A Reply

Your Email Id will not be published!