Shahid Afridi : కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పాక్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది
పాకిస్థాన్‌లో ఆడేందుకు బీసీసీఐ విముఖత చూపుతున్న నేపథ్యంలో ఆ దేశ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది ఆసక్తికర వ్యాఖ్య చేశాడు...
Shahid Afridi : వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించే విషయంలో చాలా అనిశ్చితి నెలకొంది. ఈ ఐసీసీ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే టోర్నీ షెడ్యూల్ వివరాలను ఐసీసీకి సమర్పించింది. అయితే పాక్‌లో ఆడేందుకు భారత జట్టు సంకోచిస్తోంది. భారత్-పాక్‌ల మధ్య కొన్నాళ్లుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ మ్యాచ్‌లను భారత్‌లో నిర్వహించాలని బీసీసీఐ ఐసీసీని కోరనున్నట్లు సమాచారం.
Shahid Afridi Comment
పాకిస్థాన్‌లో ఆడేందుకు బీసీసీఐ విముఖత చూపుతున్న నేపథ్యంలో ఆ దేశ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది(Shahid Afridi) ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తకుండా ఉండేందుకు ఒకసారి పాకిస్థాన్‌లో పర్యటించాలని భారత జట్టును అఫ్రిది అభ్యర్థించాడు. ముఖ్యంగా పాకిస్థాన్‌లో కోహ్లీకి పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత ఆటగాళ్లు పాకిస్థాన్‌కు రావాలని కోరుకుంటున్నాను” అని అన్నారు. ముఖ్యంగా కోహ్లి ఇక్కడ బాగా పాపులర్. కోహ్లి పాకిస్థాన్‌కు రాగానే ఇక్కడి ప్రేమను చూసి భారత్‌లో ఉన్న అభిమానులను మరిచిపోతాడు. నేను కూడా కోహ్లి అభిమానిని’ అని అఫ్రిది తెలిపాడు. “నేను ఇంతకుముందు భారతదేశాన్ని సందర్శించినప్పుడు, భారతీయ ప్రజలు మాపై చాలా ప్రేమను చూపించారు.” 2005లో ఇండియా వచ్చినప్పుడు కూడా ఇలాగే జరిగింది.. క్రికెట్‌ను భారత్, పాకిస్థాన్లలో రాజకీయాలకు దూరంగా ఉంచాలి. రెండు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ కంటే మెరుగైనది ఏమీ ఉండదని ఆఫ్రిది అభిప్రాయపడ్డారు.
Also Read : EPFO Update : బడ్జెట్ కు ముందే ఈపీఎఫ్‌వో సభ్యులకు శుభవార్త చెప్పిన కేంద్రం