CM Chandrababu Naidu : ప్రజాస్వామ్యాన్ని మోసం చేసి అంతా దోచేశారు
చివరుకు తిరుపతిలో సెటిల్మెంట్ ల్యాండ్లు, మఠం భూములను 22ఏ ఉపయోగించి కొట్టేశారన్నారు...
CM Chandrababu Naidu : సహజ వనరులైన భూములు, గనులు, అటవీ సంపదపై కూటమి ప్రభుత్వం సోమవారం శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) మాట్లాడుతూ… ప్రజాస్వామ్యానికి గంతలు కట్టి ఆఫీసుల పేరుతో కొట్టేశారన్నారు. చివరకు ల్యాండ్‌ను ఎవ్వరిని అడగకుండా దోచేసేందుకు ఓ ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ తెచ్చారని మండిపడ్డారు. విశాఖపట్నంలో ఇచ్చిన రామానాయుడు స్డూడియోను రెసిడెన్సియల్ అని చూపించి కొట్టేయాలని చూశారన్నారు. చివరకు సుప్రీకోర్టుకు వెళ్లారన్నారు. హయగ్రీవ భూములు అప్పటి స్ధానిక ఎంపీ, శారధాపీఠం, షాహీ హియరింగ్ కాలనీల పేరుతో కొట్టేయాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దస్పల్లా భూములు బలవంతంగా ట్విస్ట్ చేసి అక్కడ భూములు కొట్టేసి నిర్మాణాలు చేశారన్నారు. ఎంవీవీ, ఎంవీకే హౌసింగ్ పరుతో అసంబద్ధమైన ఒప్పందాలు చేసుకొని కొట్టేశారని ఆరోపించారు. ఒంగోలులో ఎన్నో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టిస్తే 77 మందిపై కేసులు పెట్టారన్నారు. ఇది ఇన్వెస్టిగేషన్లో ఉందని తెలిపారు.
CM Chandrababu Naidu Comment
చివరుకు తిరుపతిలో సెటిల్మెంట్ ల్యాండ్లు, మఠం భూములను 22ఏ ఉపయోగించి కొట్టేశారన్నారు. ఎవ్వరి భూమి అయినా 22ఏ పెట్టి వీరు రిజిష్ట్రేషన్ చేయించుకొని మార్చేశారని తెలిపారు. 982ఎకరాలు పుంగనూరులో అరాచకంగా ఇచ్చేశారన్నారు. రైత్వారీ పట్టాలు ఇచ్చి ఇచ్చేశారని…. అది పెద్దిరెడ్డి నియోజకవర్గమని వెల్లడించారు. 10 వేల ఎకరాలు ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ భూములు ఎస్సైన్డ్ ల్యాండ్ పేరుతో లాగేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
Also Read : Deputy CM Bhatti : రైతు భరోసా అమలుపై కీలక అంశాలను వెల్లడించిన డిప్యూటీ సీఎం