Phone Tapping Case : జూబ్లీహిల్స్ పోలీసుల కస్టడీలో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ
నాంపల్లి కోర్టులో పీటీ వారెంట్‌పై పోలీసులు రిమాండ్ చేశారు...
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును జూబ్లీహిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రాధాకిషన్‌రావును రెండు రోజుల పాటు కస్టడీకీ నాంపల్లి కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చంచల్‌గూడ జైల్లో ఉన్న ఆయనను జూబ్లీహిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మరోవైపు టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో మరో కేసు నమోదు అయ్యింది.
Phone Tapping Case
నాంపల్లి కోర్టులో పీటీ వారెంట్‌పై పోలీసులు రిమాండ్ చేశారు. యజమానిని కిడ్నాప్ చేసి క్రియా హెల్త్ కేర్ సంస్థలో కోట్ల విలువైన షేర్లను నలుగురు డైరెక్టర్ల మీదకు బలవంతంగా బదిలీ చేయించారని ఫిర్యాదు పేర్కొన్నారు. సంస్థ వ్యవస్థాపకుడు చెన్నుపాటి వేణుమాధవ్ ఫిర్యాదుతో కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలో రాధాకిషన్‌రావుతో పాటు మరో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు సహా చంద్రశేఖర్, కృష్ణ, గోపాల్, రాజ్, రవి, బాలాజీలపై కేసు నమోదు అయ్యింది. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు లుక్ అవుట్ నోటీస్ జారీ చేశారు.
Also Read : CM Revanth Reddy : రేపు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల తో భేటీ కానున్న సీఎం రేవంత్ రెడ్డి