Deputy CM Pawan : ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఈ వేస్ట్ పై కీలక వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం

నిత్యావసర వస్తువులపై మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ....

Deputy CM Pawan : ఏపీ శాసనమండలి సమావేశాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. శాసనమండలిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan) మాట్లాడుతూ… దేశంలోనే ఈ వేస్ట్‌లో రాష్ట్రం పన్నెండో స్థానంలో ఉందన్నారు. ఈ వేస్ట్ రిసైక్లింగ్ కోసం రాష్ట్రంలో ఆరు కేంద్రాలున్నాయన్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల మేరకు రీసైక్లింగ్ చేస్తున్నామన్నారు. పెరుగుతున్న ఈ వేస్ట్‌కు అనుగుణంగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ రీ సైక్లింగ్ సెంటర్స్ రావాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ తెలిపారు.

Deputy CM Pawan Comment

నిత్యావసర వస్తువులపై మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ… నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నామన్నారు. కేంద్రం కూడా యాప్ ద్వారా రాష్ట్రంలోని నాలుగు సెంటర్స్ నుంచి 22 వస్తువులు ధరలు సేకరిస్తుందన్నారు. 181 రూపాయలున్న కందిపప్పును ప్రత్యేక కౌంటర్ల ద్వారా 160 రూపాయలకే అందిస్తున్నామన్నారు. స్టీమ్ రైస్‌ను కేజీ 49 రూపాయలకు, రా రైస్‌ను 48 రూపాయలకు అందిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో కందిపప్పు , బియ్యం నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామన్నారు. ఎక్కడైనా అవకతవకలు జరిగితే చర్యలు తీసుకుంటున్నాం‌మని తెలిపారు. నిత్యావసర వస్తువుల బ్లాక్ మార్కెట్‌పై కూడా దృష్టి సారించామన్నారు. నిత్యావసర వస్తువులు వ్యాపారుల చేతుల్లో కంటే వినియోగదారుల వద్ద ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం‌మని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

మరోవైపు ఏపీ అసెంబ్లీ శాసనసభ సమావేశాలు కూడా ప్రశాంతంగా జరుగుతున్నాయి. సభ మొదలైన వెంటన స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు సమస్యలపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇస్తున్నారు. రాష్ట్రంలో రౌడీయిజంపై మంత్రి హోంమంత్రి సమాధానం ఇచ్చారు. అలాగే విశాఖపట్నం పాలిటెక్నిక్ కాలేజ్‌లో టాయిలెట్ల షార్టేజ్‌పై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రశ్నించగా… త్వరలోనే ఆ సమస్యను పరిష్కరిస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. అనంతరం టీడీఆర్ బాండ్లపై తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అడిగిన ప్రశ్నలకు మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ప్రస్నోత్తరాలు కొనసాగుతున్నాయి.

Also Read : Kamareddy MLA : అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు చూస్తే బాధాకరం

Leave A Reply

Your Email Id will not be published!