Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ బరిలో బీహార్ ఎమ్మెల్యే శ్రేయాసి సింగ్
శ్రేయసి సింగ్ స్వస్థలం గిదౌర్. దిల్లీలోని హన్స్‌రాజ్ కాలేజీ నుంచి ఆర్ట్స్‌లో డిగ్రీ చదివారు...
Olympics 2024 : రాజకీయాలే కాదు..క్రీడాల్లోనూ రాణిస్తోంది ఆమె. పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్ క్రీడాల్లో పాల్గొన్నారు బిహార్ ఎమ్మెల్యే శ్రేయాసి సింగ్. ఒలింపిక్స్ క్రీడల్లో రాజకీయ నేతలకు స్పెషల్ ఎంట్రీ అంటూ ఏదీ లేదు. అయితే బిహార్‌లోని జముయ్ ఎమ్మెల్యేగా ఎంపిక కాకముందే శ్రేయాసి సింగ్ షూటింగ్ క్రీడాకారిణి. అర్జున అవార్డు గ్రహీత కూడా. డబుల్ ట్రాప్ విభాగంలో 2014లో గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకాన్ని, 2018లో గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన పోటీల్లో బంగారు పతకాన్నీ అందుకున్నారామె.
Olympics 2024….
శ్రేయసి సింగ్ స్వస్థలం గిదౌర్. దిల్లీలోని హన్స్‌రాజ్ కాలేజీ నుంచి ఆర్ట్స్‌లో డిగ్రీ చదివారు. ఆపై ఫరీదాబాద్‌లోని మానవ్‌రచనా యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు. శ్రేయసి 2020లో జరిగిన ఆ రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటి చేసి… సిట్టింగ్ ఎమ్మెల్యే విజయ్ ప్రకాష్‌పై 41 వేల ఓట్ల మెజారిటీ సాధించారు. ఆమె బిహార్ మాజీ ఎంపీ దిగ్విజయ్ సింగ్ కుమార్తె. తల్లి పుతుల్ సింగ్ బంకా నియోజకవర్గ ఎంపీ. అమ్మానాన్నలిద్దరూ రాజకీయాల్లో రాణించడంతో ఆమె కూడా ఆ దిశగా అడుగులు వేశారు.
Also Read : Jammu Encounter : జమ్మూ కాశ్మీర్ ఎన్ కౌంటర్ లో ఒక జవాన్ మృతి, కెప్టెన్ సహా నలుగురికి గాయాలు