CM Chandrababu : సచివాలయంలో కలెక్టర్లతో కీలక సమావేశం ఏర్పాటు చేసిన సీఎం

ఢిల్లీకి ఇక్కడి నుంచి వెళ్లిన వారు కేంద్రంలో, ఆర్‌బీఐలో చాలా కీలకం అయ్యారని....

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu) సోమవారం సచివాలయంలోని 5 వ బ్లాక్‌లో కలెక్టర్లతో సమావేశం అయ్యారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి భేటీ ఇదే కావడం గమనార్హం. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఇవాళ జరుగుతున్న కాన్పరెన్స్ చరిత్రాత్మకమైన కాన్ఫరెన్స్ అని, చరిత్ర తిరగరాయబోతోందని అన్నారు. అయిదేళ్లకు ముందు ఇదే కలెక్టర్ కాన్ఫరెన్స్‌లో అప్పటి ముఖ్యమంత్రి ప్రజావేదికను కూలగొడతానని అన్నారని, గతంలో తాను సీఎం అయినప్పడు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయని… అయితే ఇప్పుడు మాత్రం ఆఫీసర్లలో మోరల్ దెబ్బతిన్నదని అన్నారు. ఈ రాష్ట్రానికి బ్రాండ్ ఏపీ దెబ్బతిన్నదని… అధికారుల మనోభవాలను దెబ్బతీసారన్నారు.

CM Chandrababu Meeting

ఢిల్లీకి ఇక్కడి నుంచి వెళ్లిన వారు కేంద్రంలో, ఆర్‌బీఐలో చాలా కీలకం అయ్యారని.. వరల్డ్ బ్యాంకులో కూడా పనిచేశారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. చిన్న తప్పు జరిగితే దాన్ని సరిచేయెచ్చు… అయితే విధ్వంసం జరిగిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఎంతో ప్రయత్నం చేయక తప్పదన్నారు. తాను మొదటి సారి ముఖ్యమంత్రి అయినప్పడు కరెంటులేని గ్రామాలు ఉన్నాయని… ఇప్పుడు డ్రైవర్ లెస్ కార్లు వచ్చేశాయన్నారు. గతంలో ఆర్ధిక సంస్కరణలు వచ్చాక కాంపిటేటివ్ ఎకానిమీగా పోటీ పడ్డామని.. 2029కి మూడవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధ గట్టిగా పనిచేస్తే 2047 నాటికి మొదటి స్ధానంలోకి వెళుతామని పేర్కొన్నారు. మనం గణితంలో ఎంతో ముందున్నామని… బ్రిటిష్ వారు ఇంగ్లీష్‌ను వదిలి పెట్టిపోయారని, ఈ రెండు ఐటికి డెడ్లీ కాంబినేషన్ దాన్ని అందిపుచ్చుకున్నామన్నారు.

1995 హైదరాబాద్‌లో బెస్ట్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేయగా.. దాన్ని తరువాత వచ్చిన వారు కొనసాగించారని సీఎం చంద్రబాబు(CM Chandrababu) పేర్కొన్నారు. ప్రపంచంలో అతి ఎక్కువ పెర్ కెపిటా ఇన్ కం సాధించిన వారు ఇండియన్స్ అని.. అందులో 30 శాతం తెలుగువారు ఉన్నారన్నారు. ఈ అయిదేళ్లలో ఎన్నివిధాల ఇబ్బందులు పడ్డామో.. అన్ని విధాలా భాదింపబడ్డామన్నారు. ఎన్నికల్లో పునర్‌నిర్మాణం చేస్తామని పవన్ కళ్యాణ్, తాను హమీ ఇచ్చామని… ఇంకా ఎన్నో సమస్యలు వచ్చాయని తెలిపారు. ఈ రాష్ట్రం దశ దిశను సూచించేదిగా ఈ కలెక్టర్ కాన్పరెన్స్ ఉంటుందన్నారు. ప్రజా వేదిక ఉంటే అక్కడ పెట్టేవాళ్లమని, బటయపెట్టడం ఇష్టం లేక ఇక్కడే పెట్టామని చెప్పారు. గత ప్రభుత్వం అయిదేళ్లలో ఒక్కసారి కూడా కలెక్టర్ కాన్ఫురెన్స్ పెట్టలేదంటే ఎంతదారుణమో అర్ధం చేసుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు.

అనంతరం విజన్ ఆంధ్రా @2047 డాక్యుమెంటును ప్రణాళికా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ ప్రెజెంట్ చేయనున్నారు. 11.15 నుంచి 12 గంటల వరకూ ప్రాథమిక రంగాలైన వ్యవసాయం, ఉద్యానవనం, ఆక్వా, మత్స్య శాఖ, పశుసంవర్ధక శాఖ, అడవులు, మైన్స్‌పై ఫోకస్ చేయనున్నారు. 12.10 నుంచి ఒంటిగంట వరకూ సంక్షేమ రంగాలయిన సాంఘిక/గిరిజన, బిసి/ఈడబ్ల్యూఎస్ , మైనార్టీ, మహిళా శిశుసంక్షేమంపై ఫోకస్ ఉంటుంది.

లంచ్ బ్రేక్ తరువాత 2 గంటలనుండి 2.15 నిముషాల వరకూ వైద్యరోగ్యం, వాతావరణంలో మార్పులు, 2.15 నుంచి2.30 వరకూ పాఠశాల విద్య, ఉన్నత విద్య, 2.30 నుంచి 2.50 వరకూ మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖలపై ప్రెజెంటేషన్లు ఇవ్వనున్నారు. కాగా సాయంత్రం ఎస్పీ లు, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు హాజరవుతారు. రాత్రి 8 గంటల వరకూ సమావేశం జరుగనుంది. పలు కీలక శాఖలపై సమీక్షలు జరగనున్నాయి. ప్రభుత్వ ప్రాధాన్యతలను ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) వివరించనున్నారు. ఈ సమావేశంలో ఏపీ మంత్రులు కూడా పాల్గొనన్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభం అయిన కలెక్టర్స్ కాన్పురెన్స్‌లో ముందుగా రెవెన్యూ శాఖామంత్రి అనగాని సత్యప్రసాద్ కలెక్టర్‌లను ఉద్దేశించి మాట్లాడారు. తమది పేదవారికోసం పనిచేసే ప్రభుత్వం అని వ్యాఖ్యానించారు.

Also Read : Durgamma Ashadam Sare: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ముగిసిన ఆషాఢ సారె కార్యక్రమం !

Leave A Reply

Your Email Id will not be published!