Telangana Secretariat: మళ్లీ ఎస్పీఎఫ్ చేతుల్లోకి తెలంగాణా సచివాలయం భద్రత !
మళ్లీ ఎస్పీఎఫ్ చేతుల్లోకి తెలంగాణా సచివాలయం భద్రత !
Telangana Secretariat: సచివాలయ భద్రత మళ్లీ ప్రత్యేక భద్రతా దళం(ఎస్పీఎఫ్) చేతుల్లోకి వెళ్లనుంది. ప్రస్తుతం తెలంగాణ ప్రత్యేక పోలీసు ఫోర్స్ (టీజీఎస్పీ) సిబ్బంది ఈ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా వీరి స్థానంలో ఎస్పీఎఫ్ను మోహరించే అవకాశం కనిపిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఈ మార్పు అమలులోకి వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి సచివాలయ భద్రత ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచీ ఎస్పీఎఫ్ సిబ్బందే పర్యవేక్షించేవారు.
Telangana Secretariat…
కానీ తెలంగాణ ప్రభుత్వం పాత సచివాలయం కూలగొట్టి, కొత్త భవనం నిర్మించిన తర్వాత నుంచి ఈ బాధ్యతను టీజీఎస్పీకి అప్పగించింది. అప్పటి నుంచి ప్రత్యేక పోలీసులే భద్రతా బాధ్యతలు చూస్తున్నారు. ఒక దశలో రెండు విభాగాలను కలిపి భద్రతకు వినియోగించాలని భావించారు. దానివల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్న ఉద్దేశంతో కేవలం టీజీఎస్పీని మాత్రమే వినియోగిస్తున్నారు. కానీ ఎస్పీఎఫ్ ఏర్పాటు చేసిందే ఇలాంటి భద్రతా వ్యవహారాల కోసమైనందున టీజీఎస్పీని తొలగించి ఆ స్థానంలో ఎస్పీఎఫ్ను నియమించాలని అధికారులు భావిస్తున్నారు.
Also Read : Laapataa Ladies: సుప్రీంకోర్టులో అమీర్ ఖాన్ మాజీ భార్య ‘లాపతా లేడీస్’ సినిమా ప్రదర్శన !