V Hanumantha Rao : రెండు సార్లు సీఎంగా అవకాశం వచ్చిన తీసుకోలేదు

బీజేపీ పార్టీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు కూడా కులగణన చేయాలంటున్నాయన్నారు...

V Hanumantha Rao : ‘‘నాకు ఓబీసీ కన్వీనర్ గా అవకాశం ఇస్తే దేశం మొత్తం తిరుగుతా’’ అని మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా తాను అక్కడి వెళ్లి న్యాయం కోసం పోరాడుతానన్నారు. ‘‘ నాకు రెండు సార్లు సీఎం అవకాశం వచ్చినా నేను తీసుకోలేదు..నాకు పదవులు ముఖ్యం కాదు.. పార్టీ కోసం పని చేస్తా’’ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని కావాలనేదే తన ఏకైక లక్ష్యమన్నారు. నిన్న ఏఐసీసీ మీటింగ్‌లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లి కార్జున ఖర్గే లు కులగణన చేయాలని చెప్పారన్నారు. కులగణన జరిగితే సామాజిక న్యాయం జరుగుతుందని రాహుల్ గాంధీ ఆలోచన అని చెప్పుకొచ్చారు. 1931 లో కులగణన జరిగిందని… మళ్ళీ ఇప్పటి వరకు జరగలేదన్నారు.

V Hanumantha Rao Comment

బీజేపీ పార్టీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు కూడా కులగణన చేయాలంటున్నాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కులగణన బిల్ పెట్టారన్నారు. కులగణన కోసం రూ.150 కోట్ల బడ్జెట్‌ను కూడా కేటాయించారన్నారు. ఓబీసీ ఎంపీల కన్వీనర్‌గా కోట్లాడి ఐఐటీ, ఐఐఎమ్‌లలో రిజర్వేషన్‌ను తీసుకొచ్చానని తెలిపారు. ఇప్పుడు ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చాయని హనుమంతరావు పేర్కొన్నారు.

Also Read : Jammu Kashmir Encounter : జమ్మూ కాశ్మీర్ ఎన్ కౌంటర్ లో 4 ఉగ్రవాదులు ఆర్మీ అధికారి మృతి

Leave A Reply

Your Email Id will not be published!