Nara Chandrababu Naidu: ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబుకి భారీ ఊరట !
ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబుకి భారీ ఊరట !
Nara Chandrababu Naidu: ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని నిందితుడిగా చేర్చాలని, కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని వైసీపీ నేత ఆళ్లరామకృష్ణారెడ్డి వేసిన రెండు పిటిషన్లను ధర్మాసనం డిస్మిస్ చేసింది. రాజకీయ కక్ష్య సాధింపులకు న్యాయస్థానాన్ని వేదికగా చేర్చుకోవద్దంటూ పిటిషనర్ రామకృష్ణారెడ్డిని జస్టిస్ సుందరేశ్ ధర్మాసనం మందలించింది. ఆ మేరకు ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ అత్యున్నత న్యాయస్థానం తాజాగా తీర్పు వెలువరించింది.
Nara Chandrababu Naidu..
ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబు(Nara Chandrababu Naidu)పై దాఖలైన ఓ పిటిషన్ పై సుప్రీం కోర్టులో బుధవారం విచారణ ప్రారంభమైంది. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ్ని ఈ కేసులో నిందితుడిగా చేర్చాలంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ పిటిషన్ వేశారు. అలాగే.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని మరో పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ ఎంఎం. సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది.
పిటిషనర్ ఆర్కే తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘‘ఫోన్ మాట్లాడుతూ చంద్రబాబు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఫోన్ కాల్ రికార్డ్స్ ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటేస్తే రూ.5 కోట్లు ఇస్తామన్నారు. అదే గైర్హాజరు అయితే రూ.2 కోట్లు ఇస్తామన్నారు. చంద్రబాబు తరఫున రేవంత్ రెడ్డి బేరసారాలు జరిపారు అని వివరించారు. ఈ కేసులో ఏ వన్ రేవంత్ రెడ్డి, ఏ 2 ఉదయసింహ. స్టీఫెన్ సన్ ఇంటికి డబ్బుల తో రేవంత్ రెడ్డి వచ్చారు. “బ్రీఫ్డ్ మీ” కాల్ లో చంద్రబాబు అయిదు కోట్ల ఆశ చూపారు అని వాదించారు. ఈ పిటిషన్లపై చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వినిపించిన వాదనలతో సంతృప్తి చెందిన ధర్మాసనం ఈ రెండు పిటీషన్లను డిస్మిస్ చేసింది.
Also Read : Botsa Satyanarayana: ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన బొత్స సత్యనారాయణ !