YSRCP : వరుస రాజీనామాలతో గందరగోళంగా మారిన జగన్ పార్టీ

వైసీసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత సంచలన ప్రకటన చేశారు...

YSRCP : అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీకి గత రెండు రోజులుగా షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు ఆ పార్టీ సీనియర్ నేతలు. ఏళ్లుగా ఆ పార్టీని అంటిపెట్టుకున్న నేతలు సైతం ఇప్పుడు ఆ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. సిద్ధమవడం ఏంటి.. ఆల్రెడీ కొందరు ముఖ్య నేతలు పార్టీ వీడగా.. మరికొందరు పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇవాళ ఉదయాన్నే ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఊహించని రీతిలో తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు.. పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఘటన ఇలా ఉండగానే.. మరో కీలక పరిణామం వైసీపీ(YSRCP) భారీగా కుదిపేసింది.

YSRCP…

వైసీసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత సంచలన ప్రకటన చేశారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు వైసీపీ అధినేత జగన్‌కు సునీత ఓ లేఖ రాశారు. గతంలో టీడీపీలోంచి వైసీపీలో చేరిన సునీత.. ఇప్పుడు వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఏపీలో వైసీపీ(YSRCP)కి భవిష్యత్ లేదనే నిర్ణయానికి వచ్చే ఆ పార్టీ నేతలు ఇలా వరుసగా జంప్ అవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన పోతుల సునీత.. ఏ పార్టీలో చేరబోతున్నారనే అంశం ఇంట్రస్టింగ్‌గా మారింది.

గతంలో టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన సునీత.. మళ్లీ సొంత గూటికి వెళ్తారా? లేక వేరే పార్టీలో జాయిన్ అవుతారా? అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే, సునీత అనుచరుల్లో జరుగుతున్న చర్చ ప్రకారం చూసుకుంటే.. ఆమె త్వరలోనే బీజేపీలో చేరుతారని తెలుస్తోంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండగం, రాష్ట్ర ప్రభుత్వంలోనూ బీజేపీ భాగస్వామ్యం కావడంతో ప్రయోజనం ఉంటుందని ఆమె భావిస్తున్నారట. ఈ కారణంగా ఆమె బీజేపీలో చేరేందుకు ఇంట్రస్ట్ చూపుతున్నారని తెలుస్తోంది. మరి ఆమె పార్టీలోకి వెళ్తారనేది క్లారిటీ రావాలంటే వేచి చూడాల్సిందే.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత.. వైసీపీ(YSRCP) నేతల్లో అంతర్మథనం మొదలైనట్లుంది. గత ఐదేళ్ల పాలన దృష్ట్యా రాష్ట్రంలో పార్టీకి భవిష్యత్ లేదనే నిర్ణయానికి ఆ పార్టీ నేతలు వస్తున్నారట. అందుకే.. పక్క చూపులు చూస్తున్నారట. ఇప్పటికే చాలా మంది ముఖ్య నేతలు వైసీపీని వీడగా.. మరికొందరు అదే ఆలోచనలో ఉన్నారు. ఇక కొందరు నేతలైతే అసలు పార్టీలో ఉన్నారో, లేదో కూడా తెలియడం లేదు. పార్టీతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి వంటి వారు బాహాటంగానే తాము పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నామని ప్రకటించారు. ఇలా ఎందరో నేతలు ఎన్నికల తరువాత వైసీపీకి దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితి బట్టి చూస్తే వైసీపీ దుకాణం త్వరలోనే బంద్ అవడం ఖాయం అని పొలిటికల్ సర్కిల్‌లో టాక్ నడుస్తోంది.

Also Read : Supreme Court : మనీ లాండరింగ్ కేసుల్లో కూడా బెయిల్ వర్తిస్తుంది

Leave A Reply

Your Email Id will not be published!