AP Rains : ఆంధ్రప్రదేశ్ లో వరద బీభత్సం…బయటకు రావొద్దంటున్న అధికారులు

నిజాంపట్నం హార్బర్‌లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ...

AP Rains : భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్రాన్ని ముంచెత్తాయి. ఆ చోట ఈ చోట అని లేకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో వర్షాలు దంచికొట్టాయి. శుక్రవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పంట పొలాలు నీట మునిగాయి. రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా జనజీవనం స్థంభించిపోయింది. ఇక భారీ వర్షాల కారణంగా విజయవాడ(Vijayawada) ఇంద్రకీలాద్రి కొండ చరియలు విరిగిపడ్డాయి. మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడి నలుగురు చనిపోయారు. వీరికి ప్రభుత్వం పరిహారం కూడా ప్రకటించింది. అయితే, ఈ ప్రాంతాలే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోటా ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ఏ చోట ఎలా ఉందో చూద్దాం..

AP Rains Update

బాపట్ల జిల్లా..

నిజాంపట్నం హార్బర్‌లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ.

సముద్రంలో వేటకు ఎవ్వరూ వెళ్లవద్దని హెచ్చరిక.

ఎవరైనా వేటుకు వెళ్లి ఉంటే తక్షణమే తిరిగి తీరానికి చేరుకోవాలని అధికారుల విజ్ఞప్తి.

బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా సముద్రం అల్లకల్లోలం.

గుంటూరు జిల్లా:

తెనాలిలో నీట మునిగిన గిరిజన సంక్షేమ బాలికల హస్టల్. ఆర్.ఆర్. నగర్ హాస్టల్ గదుల్లోకి చేరిన నీరు. తడిచిన వంట సామానులు, సరుకులు. నీరు రాకతో పడుకునే వీలులేక విద్యార్థల పడిగాపులు. పక్కన ఉన్న మున్సిపల్ స్కూల్ లోకి విద్యార్థుల తరలింపు.

విజయవాడ(Vijayawada):

కొండచరియలు పడి మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం ఆర్ధిక సాయం. ఒక్కోక్కరికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ తరఫున ఐదు లక్షల ఆర్థిక సాయం చెక్కులు పంపిణీ చేసిన మంత్రి నారాయణ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. మృతి చెందిన మేఘన, లక్ష్మి, అన్నపూర్ణ కుటుంబ సభ్యులకు చెక్కుల పంపిణీ.

అమరావతి:

కొండపల్లి ఎర్ర వంతెన వద్ద రైల్వే ట్రాక్‌పై ప్రవహిస్తున్న వరద నీరు.పలు రైళ్ళ రాకపోకలకు అంతరాయం. విజయవాడ(Vijayawada) నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే రైళ్లు రాకపోకలకు అంతరాయం. కొండపల్లి అడవుల నుంచి పోటెత్తిన వరద.

మంత్రి సమీక్ష

రెవిన్యూ శాఖ అధికారులతో సమీక్షించిన మంత్రి అనగాని సత్యప్రసాద్. వరదలో ప్రజలు చిక్కుకొని ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. ప్రజల రక్షణ నిమిత్తం రెవిన్యూ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, క్షణ క్షణం పూర్తి అప్రమత్తంగా ఉండాలి. రక్షణ చర్యల్లో ప్రజలకు సాయపడుతూ.. నష్టాలను జరగకుండా చూసుకోవలి. వర్షాలు మరో 24 గంటలు పాటు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు.

పల్నాడు జిల్లా:

రాజుపాలెం మండలం అనుపాలెం దగ్గర చెప్టాపై ఉదృతంగా ప్రవహిస్తున్న వర్షపు నీరు. జాతీయ రాహదారిపై వాహనల రాకపోకలకు అంతరాయం. సత్తెనపల్లి -మాచర్ల -హైదరాబాద్ రాకపోకలకు నిలిపివేత. కొండమోడు నుండి నరసరావుపేటపై వాహనల రాకపోకలు మళ్లింపు.

అల్లూరి జిల్లా:

అల్లూరి ఏజెన్సీ ఘాట్ రోడ్లలో వాహనాలు నిషేధం. జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ ఉత్తర్వులు. జిల్లాలో భారీ వర్షాల నేపధ్యంలో రెండు రోజులు ఐదు ఘాట్ రోడ్లలో భారీ వాహనాలు, బస్సులు, ప్రైవేటు జీపులు రవాణాను సాయంత్రం 07.00 నుండి మరుసటి రోజు ఉదయం 06.00 గంటల వరకు నిషేదం. వడ్డాది – పాడేరు ఘాట్ రోడ్, పాడేరు – చింతపల్లి కొక్కరాపల్లి ఘాట్ రోడ్, డౌనూరు – లంబసింగి ఘాట్ రోడ్, రంపచోడవరం – చింతూరు – మారేడుమిల్లి ఘాట్ రోడ్, ఎస్.కోట – అరకు అనంతగిరి రోడ్ , ఐదు ఘాట్ రోడ్లలో ఈ నిషేదం.

నంద్యాల:

భారీ వర్షాల నేపథ్యంలో మరో మూడు రోజులపాటు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరు బయటకు రావద్దు. శిథిలావస్థలో ఉన్న సంక్షేమ హాస్టళ్లు, పాఠశాల భవనాల కింద విద్యార్థులు ఎవరు వుండకూడదు. కూలిపోయే మట్టిమిద్దల కింద ప్రజలు ఎవ్వరు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువలు, వాగులు, వంకలు దాటవద్దు. పశువులను కూడ దాటించవద్దు. ఏమైనా ఇబ్బందులు వస్తే కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 08514-293903 కు తెలియచేయండి.. జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా.

విజయవాడ:

ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణమ్మ వరద ప్రవాహం. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి చేరిన వరద నీరు. 12అడుగుల గరిష్ఠ నీటి మట్టం దాటి ప్రవాహం. ఇన్ ఫ్లో.. 3,62,500 క్యూసెక్కులు. కాలువలకు.. 500. 40 గేట్లు మొత్తం, 30 గేట్లు 8 అడుగులు ఎత్తి 3,62,000 క్యూసెక్కులు నీరు సముద్రంలోకి విడుదల.

ఎన్టీఆర్ జిల్లా:

ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా ఇబ్రహీంపట్నం మండలం లో 183.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు. విజయవాడ(Vijayawada) ఈస్ట్ నియోజకవర్గంలో 174.2 మిల్లీమీటర్లు. విజయవాడ నార్త్ 173.2 మిల్లీమీటర్లు. విజయవాడ వెస్ట్ 172.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు. జిల్లా వ్యాప్తంగా యావరేజ్ రెయిన్‌ఫాల్131.98 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు. గడిచిన 100 ఏళ్లలో ఇటువంటి వర్షం చూడలేదంటున్న నగరవాసులు. 20 ఏళ్ల క్రితం 2005లో ఇటువంటి వర్షాలు విజయవాడ నగరంలో పడ్డాయి అంటున్న నగరవాసులు. విజయవాడ(Vijayawada) ముంపునకు కారణం ఔట్ ఫాల్ డ్రెయిన్స్ నిర్లక్ష్యమే కారణం అంటున్న ఇరిగేషన్ నిపుణులు. బ్రిటిష్ కాలంలో కట్టిన వాటినే కొనసాగించడం పోలే బెజవాడలో రోడ్లు మునిగిపోవడానికి కారణం.

Also Read : Duvvada Srinivas: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, తన ప్రియురాలు మాధురి కాల్‌ రికార్డ్‌ లీక్‌ !

Leave A Reply

Your Email Id will not be published!