CM Revanth Reddy : వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కోసం కీలక ప్రకటన చేసిన సీఎం
కలెక్టరేట్లల్లో కాల్ సెంటర్ఏర్పాటు చేయాలని ఆదేశించారు...
CM Revanth Reddy : తెలంగాణలో భారీ వర్షాలు , వరద సాయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా పెంచుతూ కీలక ప్రకటన చేశారు. వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం 4 లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. సోమవారం కమాండ్ కంట్రోల్ రూంలో వర్షాలపై సమావేశం నిర్వహించారు. భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అధికారులు అలర్ట్గా ఉండాలన్నారు.
CM Revanth Reddy Comment
కలెక్టరేట్లల్లో కాల్ సెంటర్ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో వ్యవస్థను సన్నద్దంగా ఉంచుకోవాలన్నారు. భారీ వర్షాల సమయంలో అత్యవసర సేవల కోసం రాష్ట్రంలోని ఎనిమిది పోలీస్ బెటాలియన్లకు ఎన్డీఆర్ఎఫ్ తరహాలో శిక్షణ ఇవ్వాలన్నారు. వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం 4 లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు జరిగిన నష్టంపై తక్షణమే అధికారులు స్పందించాలని ఆదేశించారు. వరదల్లో చనిపోయిన పశువులు, మేకలు,గొర్రెలకు పరిహారం పెంచాలని అధికారులకు తెలిపారు. వరద నష్టంపైన కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు.తక్షణమే కేంద్ర సాయం కోరుతు సీఎం లేఖ రాశారు.జాతీయ విపత్తుగా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతూ లేఖలో పేర్కొన్నారు.వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్(CM Revanth Reddy) లేఖ రాశారు.అలాగే ప్రభావిత జిల్లాలు ఖమ్మం, భద్రాద్రి కొత్త గూడెం, మహబూబాబాద్, సూర్యాపేట కలెక్టర్లలకు తక్షణ సాయం కోసం 5 కోట్లు విడుదల చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు ఈరోజు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ ప్రకటించింది. బంగాళాఖాతంలో అల్పపీడనంతో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రేపు కూడా మహారాష్ట్రలోని విదర్భలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఈ క్రమంలోనే విదర్భకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
వెస్ట్ మధ్యప్రదేశ్, మరాఠవాడ, తెలంగాణ, గుజరాత్ అస్సాం మేఘాలయలో భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది. వెస్ట్ మధ్యప్రదేశ్, మరాఠవాడ, తెలంగాణ , గుజరాత్, అస్సాం, మేఘాలయకు ఐఎండీ ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది. అటు రెండు తెలుగు రాష్ట్రాలు వర్షాలకు అతలాకుతలం అవవుతున్నాయి. జనజీవనం స్తంభించింది. కాలనీలకు కాలనీలే వరద నీటిలో చిక్కుకుపోతున్నాయి. తెలంగాణలోని ఖమ్మం జిల్లా, నిజామాబాద్ తదితర జిల్లాల్లో పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. నదులు, ఏరులు, వాగులన్నీ పొంగి పొర్లుతున్నాయి. దీంతో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియక జనం బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. కొన్ని ప్రాంతాల వాసులు పూర్తిగా పునరావాస కేంద్రాలకు చేరారు. సమయానికి ఆహారం, నీరు, నిద్ర అన్నీ కరువై అలమటిస్తున్నారు.
Also Read : Trains Cancelled : ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు 420 రైళ్లు రద్దు చేసిన రైల్వే శాఖ