Minister Tummala : మున్నేరు ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలపై ఆరా తీసిన మంత్రి
వరద ఉధృతి తగ్గడంతో శానిటేషన్ పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు...
Minister Tummala : ఖమ్మం జిల్లాలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వరదలతో మున్నేరు ఉగ్రరూం దాల్చింది. మున్నేరు బ్రిడ్జిలపై నుంచి నీళ్లు పొంగి ప్రవహించడంతో పదులకొద్దీ డివిజన్లు ముంపునకు గురయ్యారు. వెంటనే ప్రభుత్వం మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టింది. బియ్యం, నూనె వంటి నిత్యావసరాలను ముంపు బాధితులకు ప్రభుత్వం అందజేస్తోంది. మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. సహాయక చర్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala) మాట్లాడుతూ.. మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయ చర్యలు సాగుతున్నాయన్నారు.
Minister Tummala Comment
వరద ఉధృతి తగ్గడంతో శానిటేషన్ పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. పది డివిజన్లలో మొత్తం 7,480 గృహాలు దెబ్బతిన్నాయని తెలిపారు. 5 జీసీబీలు, 50 ట్రాక్టర్లు, 75 వాటర్ ట్యాంకర్లు, 8 ఫైర్ ఇంజిన్లు 600 మంది శానిటేషన్ సిబ్బందితో పనులు సాగుతున్నాయన్నారు. ఇళ్లలో బురద తొలగించేందుకు వాటర్ ట్యాంకర్లు ద్వారా నీళ్ళు సరఫరా చేస్తున్నామన్నారు. 12 హెల్త్ క్యాంప్లు ఏర్పాటు చేశామన్నారు.
ఖమ్మం నగరంలో మొత్తం 197 విద్యుత్ స్తంభాలు దెబ్బతినగా పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. సాయంత్రానికి ముంపు ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు కల్పిస్తామని చెప్పారు. పోస్ట్ ఫ్లడ్ అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
Also Read : Minister Ponnam Prabhakar : అధికారులంతా 24/7 పని చేయాలని ఆదేశాలు జారీ చేసిన మంత్రి