Gudivada Amarnath : ఏపీ ప్రభుత్వాన్ని ప్రశంసించిన షర్మిలపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి
రేషన్ వాహనాలు, సచివాలయ వ్యవస్థ ఇతరులను ఆదుకున్నాయన్నారు...
Gudivada Amarnath : పీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డితో పాటు వరదలపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వాన్ని షర్మిల ప్రశంసించడంపై గుడివాడ అమర్ నాథ్ తన అక్కసునంతా వెళ్లగక్కారు. షర్మిల గత ఐదేళ్లు తెలంగాణలో తిరిగారని.. ఎన్నికల ముందే మన రాష్ట్రానికి వచ్చారన్నారు. ఆమె తెలంగాణ వరదల గురించి మాట్లాడారో.. లేదంటే మన రాష్ట్ర వరదలు విషయంలో మాట్లాడారో అనేది తనకు తెలియదని గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath) అన్నారు. రాష్ట్రంలో వచ్చిన వరదలు ప్రకృతి వైపరీత్యం వలన వచ్చినవి కావని.. ప్రభుత్వం సృష్టించిన వరదలని ఆయన తెలిపారు.
వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వహించిందో ప్రజలకి సమాధానం చెప్పాలని గుడివాడ్ అమర్నాథ్ అన్నారు. ప్రజల ప్రాణాలను గాలికి వదిలేశారన్నారు. రేషన్ వాహనాలు, సచివాలయ వ్యవస్థ ఇతరులను ఆదుకున్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలోకి వరదలు వచ్చాయి.. కాబట్టే ఆయన బస్సులో ఉంటున్నారన్నారు. వరద బాధితుల విషయంలో ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. జగన్ కారణంగానే వరదలు వచ్చాయని కూటమి నేతల ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. వరదలు ఈ రోజు వచ్చినా, రేపు వచ్చినా, ఎల్లుండి వచ్చినా జగనే కారణమా? అని గుడివాడ్ అమర్నాథ్ ప్రశ్నించారు.
Gudivada Amarnath Comment
గుడివాడ అమర్నాథ్.. వాస్తవానికి ఏపీ చరిత్రలోనే ఒక ఫెయిల్యూర్ మంత్రి అని సోషల్ మీడియా వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి రోజూ కోడై కూసేది. అప్పట్లో ఆయనపై వచ్చిన విమర్శలు, ట్రోల్స్ అన్నీ ఇన్నీ కావు. వరదలు వచ్చినప్పటి నుంచి చంద్రబాబు అవిశ్రాంతంగా జనాలతో ఉంటూ వస్తున్నారు. నిద్రాహారాలు మాని మరీ బాధితులకు ఆహారం, నీళ్లు అందించేందుకు శ్రమించారు. వారిని వరద నుంచి బయటకు తీసుకొచ్చారు. ఒకవైపు చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురుస్తున్న సమయంలో గుడివాడ అమర్నాథ్ రాంగ్ ఎంట్రీ ఇచ్చి తిరిగి ఇష్టానుసారంగా కామెంట్స్ చేశారు. పైగా షర్మిలను కూడా వదలకుండా వ్యాఖ్యలు చేశారు.
Also Read : AP Home Minister : వర్షాలపై మొబైళ్లకు అలర్ట్స్ పంపించాలని ఆదేశాలు