Minister Sridharbabu : పీఏసీ చైర్మన్ అరకపూడి గాంధీ నియామకంపై స్పందించిన ఐటీ మంత్రి

తాను బీఆర్ఎస్ పార్టీ సభ్యుడిని అని గాంధీ చెప్పుకున్నారని....

Minister Sridharbabu : పీఏసీ చైర్మన్‌గా అరికపూడి గాంధీ నియామకం పట్ల మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridharbabu) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకుడిని పీఏసీ చైర్మన్‌గా నియమించినట్టు అర్థం చేసుకుంటున్నామన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో, రూల్ బుక్ ప్రకారమే స్పీకర్ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నామన్నారు. స్పీకర్ నిర్ణయంలో తాము జోక్యం చేసుకోమన్నారు. స్పీకర్ విషయంలో కూడా అడ్డగోలుగా మాట్లాడడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను బీఆర్ఎస్ ప్రభుత్వం కూల్చేసిందని వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం పీఏసీ చైర్మన్‌గా ఎవరిని నియమించిందో అందరికీ తెలుసన్నారు.

తాను బీఆర్ఎస్ పార్టీ సభ్యుడిని అని గాంధీ చెప్పుకున్నారని.. తాను బీఆర్ఎస్ నాయకుడిని అని గాంధీ చెప్తుంటే కాదని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారన్నారు. ఆ పార్టీ నాయకుల మధ్య సఖ్యత లేకపోతే తాము ఏం చేస్తామన్నారు. పీఏసీ చైర్మన్‌కు ఆ పార్టీ నాయకులకు ఏమైనా సమస్యలు ఉన్నాయో తమకేం తెలుసని వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను సీఎంని కలిశా అని గాంధీ చెప్పారన్నారు. పొద్దున, మాధ్యాహ్నం తేడా లేకుండా మాట్లాడేది ఇద్దరే అని… కేటీఆర్, హరీష్ తప్పా ఆ పార్టీలో మాట్లాడే నాయకులే లేరా అని ప్రశ్నించారు. అసలు బీఆర్ఎస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. ఆ పార్టీలో ఇద్దరు తప్పా నాయకులు ఎవరూ లేరా అని నిలదీశారు.

Minister Sridharbabu Comment

ఎమ్మెల్యే పార్టీ మార్పుపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై శ్రీధర్ బాబు(Minister Sridharbabu) స్పందిస్తూ.. ‘‘కోర్టు పరిధిలో ఉన్న అంశాలని తాము మాట్లాడలేం కదా. కోర్టులను మేం తప్పకుండా గౌరవిస్తాం. ఏం చేయాలో హైకోర్టు చెప్పలేదు. నాలుగు వారాల్లో పక్రియ మొదలు పెట్టాలని చెప్పింది. లెజిస్లేచరి వ్యవస్థలో న్యాయ వ్యవస్థ జోక్యం ఎంత వరకు ఉంటుంది అనే అంశంపై చర్చ జరుగుతోంది.10 షెడ్యూల్ ప్రకారం ఇంత టైంలో నిర్ణయం జరగాలని చెప్పకాగా.. అసెంబ్లీ ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నియమితులయ్యారు. ఆయనతో పాటు అంచనాల కమిటీకి కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతిరెడ్డిని, ప్రభుత్వరంగ సంస్థల కమిటీకి షాద్‌నగర్‌ ఎమ్మెల్యే కె.శంకరయ్యను చైర్మన్‌లుగా అసెంబ్లీ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ నియమించారు.

తెలంగాణ శాసనసభ, శాసనమండలి బిజినెస్‌ రూల్స్‌ ప్రకారం ఈ మూడు కమిటీలకు ఎన్నికలు జరిగినట్లు అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు వెల్లడించారు. ప్రతి కమిటీకి శాసనసభ నుంచి 9 మంది, శాసనమండలి నుంచి నలుగురు ఎన్నికైనట్లు పేర్కొన్నారు. పీఏసీకి ఎన్నికైన సభ్యుల నుంచి అరికెపూడి గాంధీని, అంచనాల కమిటీకి ఎన్నికైన సభ్యుల నుంచి నలమాద పద్మావతిరెడ్డిని, ప్రభుత్వరంగ సంస్థల కమిటీకి ఎన్నికైన సభ్యుల నుంచి కె.శంకరయ్యను ఆయా కమిటీలకు చైర్మన్లుగా స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ నియమించినట్లు తెలుపుతూ సోమవారం బులెటిన్‌ విడుదల చేశారు.లేదు’’ అని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

Also Read : MLA KTR : పెంటవెల్లిలో 499 మంది రైతులు ఉండగా ఏ ఒక్కరికి రుణమాఫీ కాలేదు

Leave A Reply

Your Email Id will not be published!