Mamata Banerjee : నిరసన తెలుపుతున్న జూనియర్ డాక్టర్లతో నేరుగా మాట్లాడిన సీఎం

నిరసన తెలుపుతున్న జూనియర్ డాక్టర్లతో నేరుగా మాట్లాడిన మమత

Mamata Banerjee : ఆర్జీ కర్ ఆసుపత్రిలో వైద్యురాలి హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయమైన ‘స్వస్థ్ భవన్’ ఎదుట నిరసనలు తెలుపుతున్న జూనియర్ వైద్యుల శిబిరాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారంనాడు అనూహ్యంగా సందర్శించారు. జూనియర్ వైద్యులతో నేరుగా మాట్లాడి, వారిని విధుల్లోకి చేరాలని కోరారు. ముఖ్యమంత్రిగా తాను ఇక్కడకు రాలేదని, ఒక సోదరిగా వచ్చానని, బాధితురాలికి న్యాయం జరగాలనే తాను కోరుకుంటున్నానని మమతా బెనర్జీ(Mamata Banerjee) చెప్పారు “రోడ్లపై మీరు నిరసనలు చేస్తుంటే నేను నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను. మీ డిమాండ్లను అధ్యయనం చేస్తాను. దోషులను తేలిన వారిపై చర్యలు తీసుకుంటాను. ఏ ఉద్దేశంతో మీరు నిరసనలు చేస్తున్నారో నేను అర్ధం చేసుకున్నాను. నేను కూడా స్టూడెంట్‌గా లీడర్‌గా ఉద్యమాల్లో పాల్గొ్న్నా. మీకు తప్పనిసరిగా న్యాయం చేస్తాను. సీనియర్లు (వైద్యులు) మీ అసిస్టెన్స్ లేకుండా పని చేయలేరు. విధుల్లో చేరాల్సిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. నామీద నమ్మకంతో చర్చలకు రండి. మీ మీద ఎలాంటి చర్యలు తీసుకోనని హామీ ఇస్తున్నాను” అని వైద్యులకు సీఎం భరోసా ఇచ్చారు.

Mamata Banerjee Meet

చర్చలతో సమస్యను పరిష్కరించేందుకు తాను చాలా రోజులుగా ఎదురుచూస్తున్నానని, భద్రతా సిబ్బంది వద్దని చెప్పినప్పటికీ తాను ఇక్కడకు వచ్చానని జూనియర్ వైద్యులకు మమతా బెనర్జీ నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. సమస్యను పరిష్కరించడానికి ఇదే తన చివరి ప్రయత్నమని తెలిపారు. అయితే, తమ డిమాండ్లపై చర్చ జరిగేంత వరకూ రాజీపడేది లేదని జూనియర్ వైద్యులు చెప్పడంతో మమతా బెనర్జీ అక్కడి నుంచి నిష్క్రమించారు.

Also Read : Minister Komatireddy : మాజీ మంత్రి హరీష్ రావు పై నిప్పులు చెరిగిన మంత్రి కోమటిరెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!