AP Cabinet Meeting : వాలంటీర్ల పునరుద్ధరణపై ఏపీ కేబినెట్ కీలక సమావేశం

వలంటీర్ల పునరుద్దరణపై మరింత సమాచారం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు...

AP Cabinet : ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రిమండలి చర్చించింది. అలాగే వలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణపై కేబినెట్‌లో చర్చకు వచ్చింది. గతేడాది ఆగస్టులోనే వలంటీర్ల కాలపరిమితి ముగిసిందని ఈ సందర్భంగా అధికారులు కేబినెట్‌‌కు తెలియజేశారు. కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా నాడు వలంటీర్లతో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజీనామా చేయించారని పలువురు మంత్రులు తెలియజేశారు. తప్పుడు విధానాలు.. దొంగ పద్ధతుల్లోనే జగన్ పాలన సాగించారని ఈ సందర్భంగా మంత్రులు చెప్పారు.

వలంటీర్ల పునరుద్దరణపై మరింత సమాచారం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) సూచించారు. గత ప్రభుత్వం సాక్షి పత్రిక కొనుగోళ్లల్లో చేసిన అవకతవకలపైనా కేబినెట్‌లో చర్చ జరిగింది. రెండేళ్లల్లోనే సాక్షి పత్రిక కొనుగోళ్ల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి రూ. 205 కోట్లు ఖర్చు చేశారని మంత్రిమండలి సమావేశంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలియజేశారు. నిబంధనలకు విరుద్ధంగా సాక్షికి జరిపిన చెల్లింపులపై విచారణకు ఆదేశిద్దామని ముఖ్యమంత్రి చెప్పారు. సాక్షి పత్రిక సర్క్యులేషన్ ఎంతుంది..? ఏ నిబంధనల ప్రకారం సాక్షి పత్రిక కొనుగోళ్లకు నిధులు కేటాయించారనే దానిపైనా ఎంక్వైరీ వేయాలని పలువురు మంత్రులు పేర్కొన్నారు.

AP Cabinet Meeting Updates

అలాగే కొత్త లిక్కర్ పాలసీకి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రైవేట్ మద్యం దుకాణాలకు అనుమతిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.100 లోపు నాణ్యమైన మద్యం అందుబాటులోకి తేవాలని మంత్రి వర్గం నిర్ణయించింది. రూ.99కే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తేవడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు ప్రకటించిన వరద సాయం ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. బీసీలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నిలబెట్టుకున్నారు. చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రి మండలి సమావేశంలో తీర్మానం చేశారు. బీసీలకు రిజర్వేషన్లపై కేంద్రానికి చంద్రబాబు కేబినెట్ సిఫార్సు చేసింది. బీసీలకు రిజర్వేషన్ల తీర్మానంపై చంద్రబాబు(CM Chandrababu)కు మంత్రి సవిత ధన్యవాదాలు తెలియజేశారు.

Also Read : MLA Vishnu Kumar Raju : రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది

Leave A Reply

Your Email Id will not be published!