UP CM Yogi : ఆహారంలో కల్తీ విష్యంపై అత్యున్నత సమావేశం ఏర్పాటు చేసిన యూపీ సీఎం
ఆహార సంస్థలపై ముమ్మర తనిఖీలు నిర్వహించాలి. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించాలి...
CM Yogi : సామాన్య ప్రజానీకం అనునిత్యం తీసుకునే జ్యూస్‌లు, పప్పుధాన్యాలు, బ్రెడ్ వంటి ఆహార పదార్ధాల్లో మానవ వ్యర్థాలు కలుస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో తరచు వెలుగు చూస్తుండటంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(CM Yogi) సీరియస్ అయ్యారు. వీటిని ‘అసహ్యకరమైన’ చర్యలుగా పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావని, వీటివల్ల ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని అన్నారు. ఆహారంలో కల్తీ ఘటనలపై మంగళవారంనాడు అత్యున్నత స్థాయి సమావేశాన్ని యోగి ఆదిత్యనాథ్(CM Yogi) ఏర్పాటు చేశారు. అన్ని హోటళ్లు, దాబాలు, రెస్టారెంట్లు సహా ఆహార విక్రయశాలలపై తక్షణమే సమగ్ర తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాలను పెంచేందుకు కఠినమైన ఆదేశాలను జారీ చేశారు.
CM Yogi Comment
ఆహార సంస్థలపై ముమ్మర తనిఖీలు నిర్వహించాలి. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించాలి. ఫుడ్ సేఫ్టే, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్, స్థానిక యంత్రాగం మధ్య పూర్తి సమన్వయంతో ఈ తనిఖీలు జరపాలి. ఆపరేటర్లు, మేనేజర్లు, సిబ్బందిని సైతం తనిఖీలు చేయాలి. ఆహార సంస్థలు తప్పనిసరిగా తమ ఆపరేటర్లు, ప్రొప్రయిటర్లు, మేనేజర్ల పేర్లు, చిరునామాలను బోర్డులపై ప్రదర్శించాలి. ఇందుకోసం అవసరమైతే ఫుడ్ సేఫ్టే అండ్ స్టాండర్డ్స్ యాక్ట్‌కు సవరణలు చేయాలి. ఫుడ్ సెంటర్లనీ డైనింగ్ ప్రాంతాలతో సహా కీలకమైన చోట్ల సీసీటీవీలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. సీసీటీవీ ఫుటేజ్‌ను ఆపరేటర్లు భద్రంగా ఉంచాలి. అధికారులు కోరినప్పుడు వాటిని అందుబాటులో ఉంచాలి.
ఆహార పదార్ధాలు తయారు చేసేటప్పుడు, సర్వీస్ చేసేటప్పుడు వంటవాళ్లు, వెయిటర్లు సహా సిబ్బంది తప్పనిసరిగా మాస్క్‌లు, గ్లౌజులు ధరించాలి. పరిశుభ్రతా ప్రమాణాలు పాటించాలి. ఆహార పదార్ధాల్లో మానవ వ్యర్థాలు, హానికరమైన పదార్ధాలను కలిపినట్లు తేలితే దోషులకు కఠిన జరిమానాలు విధిస్తారు. ఆహార భద్రతా ప్రమాణాలు పాటించని వారిపై తక్షణ చర్చలు ఉంటాయి. ఆహార పదార్ధాల తయారీ, అమ్మకాల విషయంలో ఈ కఠిన నిబంధనలు వర్తిస్తాయి. ఆహార భద్రత విషయంలో ప్రజల నమ్మకాన్ని పునరుద్ధరించడమే తమ లక్ష్యమని, ప్రజారోగ్యం విషయంలో రాజీపడేది లేదని, భవిష్యత్‌లో ఆహార కల్తీ ఘటనలు పునరావృతం కారాదని ముఖ్యమంత్రి తమ ఆదేశాల్లో స్పష్టం చేశారు.
Also Read : CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో కీలక అంశం