KTR : పంచాయతీల్లో పాలన గాడితప్పిందంటూ సీఎం పై భగ్గుమన్న కేటిఆర్

మాజీ సర్పంచుల సంగతి సరే చివరకు పంచాయతీ కార్యదర్శులు కూడా అప్పులపాలు కావల్సిందేనా రేవంత్...

KTR : ఢిల్లీ విమానం ఎక్కడం..దిగడమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సరిపోతుంది.. కానీ ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు.పల్లెలేమో నిధుల్లేక నీరసంతో తల్లడిల్లిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈమేరకు సోషల్ మాధ్యమం ట్విట్టర్(ఎక్స్)‌లో కేటీఆర్ ట్విట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్(KTR) తీవ్ర విమర్శలు గుప్పించారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఆసరా పథకం పైసలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ విడుదల చేయడం లేదని ధ్వజమెత్తారు. రోడ్లు వేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవా? అని కేటీఆర్ ప్రశ్నించారు.

KTR Slams…

‘‘మాజీ సర్పంచుల సంగతి సరే చివరకు పంచాయతీ కార్యదర్శులు కూడా అప్పులపాలు కావల్సిందేనా రేవంత్. దేశానికి పట్టుగొమ్మలు గ్రామాలు. అలాంటి గ్రామాలను అభివృద్ధి చేయాలని ‘‘పల్లెప్రగతి’’ కార్యక్రమం చేపట్టింది కేసీఆర్ ప్రభుత్వం. అలాంటి గొప్ప కార్యక్రమం పల్లె ప్రగతిని అటకెక్కించారు వృద్ధులకు సరైన సమయానికి ఆసరా పెన్షన్లు అందక అల్లాడుతుంటే దాచుకున్న డబ్బులతో తప్పని పరిస్థితుల్లో రోడ్లు వేస్తున్నారు. ఆసరా పెన్షన్‌తో దాతలుగా సహాయం చేస్తే తప్ప రోడ్లు వేయలేని పరిస్థితి గ్రామాల్లో ఉంది’’ అని కేటీఆర్(KTR) ధ్వజమెత్తారు.

‘‘ అవ్వాతాతలకే కాదు చివరకు గ్రామ పనులకు కూడా కేసీఆర్ ఆసరా పథకం ఆసరా అవుతోంది. ఎందుకు మీ పాలన- కొంచెం కూడా సిగ్గు అనిపిస్త లేదా. ప్రజల బాధలు చూసి తలకాయ ఎక్కడ పెట్టుకుంటావో ఆలోచించుకో రేవంత్. ఫైనాన్స్ కమిషన్ నిధులు కూడా విడుదల చేయకపోవడంతో గ్రామాలు కునారిల్లుతున్నాయి. పంచాయతీల్లో పాలన గాడితప్పింది..పారిశుద్ధ్యం పడకేసింది….ప్రజలు రోగాల పాలవుతున్నారు.. ఎన్నికల సమయంలోనేమో 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ అని ఫుల్ పేజీ ప్రకటనలు, స్టాంపు పేపర్ల మీద అఫిడవిట్లు ఇప్పుడేమో, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 300 రోజుల తర్వాత, మీ నాయకులు, కార్యకర్తలు కాని ప్రజలకు సమాధానం చెబుతారా..? ఢిల్లీ నుంచి రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ వచ్చి ప్రజలకు క్షమాపణ చెబుతారా’’ అని కేటీఆర్ ప్రశ్నించారు.

Also Read : Pakistan Govt : ఉన్నట్టుండి లక్ష 50 వేల మందిని ప్రభుత్వ విధుల నుంచి తొలగించిన పాక్

Leave A Reply

Your Email Id will not be published!