TG DSC 2024 Results : ఎట్టకేలకు డీఎస్సీ ఫలితాలు విడుదల చేసిన తెలంగాణ సర్కార్

జూలై 18వ తేదీ నుంచి ఆగస్ట్ 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలను రేవంత్ సర్కార్ నిర్వహించింది...

TG DSC 2024 : తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి విద్యాశాఖ నిర్వహించిన ‘టీజీ డీఎస్సీ-2024’ పరీక్ష ఫలితాలు సోమవారం (సెప్టెంబరు 30) విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఈ డీఎస్సీ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. రాష్ట్రంలో 11 వేల 062 టీచర్‌ పోస్టుల భర్తీకి విద్యాశాఖ మార్చి 1న డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది ప్రభుత్వం. అభ్యర్థులకు జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు రాశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 29న 11,062 టీచర్ ​పోస్టుల భర్తీకి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్​ విడుదల చేసిన విషయం తెలిసిందే.

జూలై 18వ తేదీ నుంచి ఆగస్ట్ 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలను రేవంత్(CM Revanth Reddy) సర్కార్ నిర్వహించింది. 2.45 లక్షల మంది అభ్యర్థులు డీఎస్సీ పరీక్షలు రాశారు. పరీక్షలకు సంబంధించి వెబ్‌సైట్‌ నుంచి రెస్పాన్స్‌ షీట్‌లను తొలగించారు. ఇప్పటికే ప్రాథమిక కీతోపాటు తుది కీని కూడా విడుదల చేశారు. తుది కీపై అభ్యర్థుల నుంచి కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. ముఖ్యంగా 12 ప్రశ్నలకు సంబంధించిన జవాబులపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వీటిపై ఇప్పటికే నిపుణుల కమిటీ విద్యాశాఖకు నివేదిక సమర్పించినట్లు సమాచారం. ఈ నివేదిక ఆధారంగా ఈ అభ్యంతరాలను పరిష్కరించారు. డీఎస్సీ పరీక్షల్లో వచ్చిన మార్కులకు టెట్‌ మార్కుల వెయిటేజీని కలిపి జనరల్‌ ర్యాంకులను వెల్లడించారు.

TG DSC 2024 Results Update..

స్వల్ప కాలంలో ఫలితాలను విడుదల చేసి ప్రభుత్వం సరికొత్త రికార్డు నెలకొల్పింది. అయితే జిల్లాలో ఉపాధ్యాయ పోస్టుల కోసం అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులకు పోటీ తీవ్రంగా ఉన్న జిల్లాల్లో వికారాబాద్‌ మూడో స్థానంలో ఉంది. ఒక పోస్టుకు 50 నుంచి 100 మంది వరకు పోటీపడ్డారు. ఎస్జీటీ పోస్టుల విషయానికి వస్త్తే రాష్ట్రంలో ఎక్కువ పోటీ వికారాబాద్‌ జిల్లాలోనే నెలకొనడం గమనార్హం. 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ఫిబ్రవరి 29న ‘డీఎస్సీ-2024’ నోటిఫికేషన్‌ విడుదల చేసింది ప్రభుత్వం. మార్చి 4 నుంచి జూన్ 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు తీసుకున్నారు. ఈ నోటిఫికేషన్‌లో 6,508 ఎన్జీటీ పోస్టులు, 2,629 స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు, 727 లాంగ్వేజ్ పండిట్ పోస్టులు, 182 పీఈటీలు పోస్టులు, స్పెషల్‌ కేటగిరీలో 220 పోస్టులు స్కూల్ అసిస్టెంట్లు , 796 పోస్టులు ఎస్జీటీలు భర్తీ చేయనున్నారు. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించారు. ఈ ఉద్యోగాలకు మొత్తం 2,79,957 మంది దరఖాస్తు చేశారు. 2,45,263 మంది హాజరయ్యారు.

Also Read : KTR : పంచాయతీల్లో పాలన గాడితప్పిందంటూ సీఎం పై భగ్గుమన్న కేటిఆర్

Leave A Reply

Your Email Id will not be published!