Deputy CM Udhayanidhi : తొలి విడతగా 100 మంది క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు..
ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చెన్నై బయట మొదటి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు...
Deputy CM Udhayanidhi : క్రీడాకారుల విజ్ఞప్తి మేరకు తొలివిడతగా వంద మంది క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు అందించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి తెలిపారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటి కార్యక్రమంగా విరుదునగర్ జిల్లాలో జరిగిన ప్రభుత్వ సంక్షేమ సహాయాల పంపిణీ కార్యక్రమంలో ఉదయనిధి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ట్రోఫీ క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన 2,111 మందికి రూ.42.96 కోట్ల విలువైన బహుమతులు అందజేశారు. ముందుగా, 255 మంది దివ్యాంగులకు రూ.45.39 కోట్ల విలులైన ఉచిత ఇళ్లపట్టాలు, మరో 20 మంది దివ్యాంగులు స్వయం ఉపాధి పొందేలా రుణసాయాన్ని ఉప ముఖ్యమంత్రి అందజేశారు.
Deputy CM Udhayanidhi Comment
ఈ సందర్భంగా ఉదయనిధి(Deputy CM Udhayanidhi) మాట్లాడుతూ… ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చెన్నై బయట మొదటి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. మదురైలో ఫిబ్రవరి జరిగిన కలైంజర్ క్రీడా పరికారాలు అందజేసే కార్యక్రమం ప్రారంభించామని, ఈ కార్యక్రమంలో 18 జిల్లాల్లోని అన్ని గ్రామాలకు క్రీడా పరికరాలు అందజేశామని తెలిపారు. దక్షిణ జిల్లాలు అంటేనే ధైర్యసాహసాలకు పేరుతో పాటు వీర క్రీడాకారులకు కూడా ప్రసిద్ధి చెందాయన్నారు.
ఎంతోమంది క్రీడాకారులను తయారుచేసిన జిల్లాలు కాగా, మరెందరో ఈ జిల్లాల నుంచి వస్తున్నార అన్నారు. చెస్‌లో రాష్ట్రానికి చెందిన గుహేష్, ప్రజ్ఞానంద, వైష్ణవి, శ్రీనాధ్ అంతర్జాతీయంగా రాణిస్తూ రాష్ట్రానికి మంచి గుర్తిపు, గౌరవం, కీర్తి తెస్తున్నారని అభినందించారు. మూడేళ్లలో 1,300 మంది క్రీడాకారులకు రూ.38 కోట్లను ప్రోత్సాహక నిధిగా ముఖ్యమంత్రి అందజేశారని తెలిపారు. అలాగే, క్రీడాకారుల కోరిక మేరకు 100 మంది క్రీడాకారులకు త్వరలో ప్రభుత్వ ఉద్యోగాలు అందించనున్నామన్నారు. ఖేలో ఇండియా, కార్ రేస్ తదితరాలను రాష్ట్రప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిందన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి కేకేఎ్‌సఎ్‌సఆర్ రామచంద్రన్, ఆర్ధిక శాఖ మంత్రి తంగం తెన్నరసు, వాణిజ్య శాఖ మంత్రి మూర్తి, విరుదునగర్ కలెక్టర్ జయశీలన్, అదనపు ప్రధాన కార్యదర్శి అతుల్య మిశ్ర, మేఘనాధరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read : TG Governor : ‘హైడ్రా’ ఆర్డినెన్స్ కు పచ్చజెండా ఊపిన గవర్నర్ ‘జిష్ణు దేవ్’