Arvind Kejriwal : అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్

లుటియంస్‌ జోన్‌కు ఆయన మకాం మారుస్తున్నారు...

Arvind Kejriwal : ముఖ్యమంత్రి పదవికి గత నెలలో రాజీనామా చేసిన ‘ఆప్’ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తన అధికారిక నివాసమైన నార్త్ ఢిల్లీ సివిల్‌‍లైన్స్‌ లోని 6, ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్ రెసిడెన్స్‌ను శుక్రవారంనాడు ఖాళీ చేశారు. లుటియంస్‌ జోన్‌కు ఆయన మకాం మారుస్తున్నారు. ఆయన అధికారిక నివాసానికి ఉదయం రెండు మినీ ట్రక్కులు చేరుకోవడంతో షిఫ్టింగ్ ప్రక్రియ మొదలైంది. కేజ్రీవాల్, ఆయన భార్య సునిత కేజ్రీవాల్, కుమారుడు ఒక కారులోనూ, ఆయన తల్లిదండ్రులు, కుమార్తె మరో కారులోనూ బయలుదేరారు. మండి హౌస్‌ సమీపంలోని ఫరోజ్‌షా రోడ్డులో ఉన్న పంజాబ్ రాజ్యసభ ఎంపీ అశోక్ మిట్టల్ అధికారిక నివాసంలో కేజ్రీవాల్(Arvind Kejriwal) కుటుంబ సభ్యులు ఉండనున్నారు. ఈ బంగ్లా రవిశంకర్ శుక్లా లేన్‌లోని ఆప్ ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఉంది.

Arvind Kejriwal Vacated…

కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన 2015 నుంచి సివిల్‌లైన్స్‌లోని 6, ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్డు నివాసంలోనే ఉంటున్నారు. సీఎంగా రాజీనామా చేసిన తర్వాత అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో తన నివాసాన్ని కేజ్రీవాల్ ఎంచుకోవడంపై ‘ఆప్’ ఎంపీ మిట్టల్ ఒక వీడియో సందేశంలో సంతోషం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ రాజీనామా చేసినప్పుడు ఆయనకు ఉండటానికి ఇల్లు లేదనే విషయం తెలిసి ఢిల్లీలోని తన నివాసానికి గెస్ట్‌గా రావాలని తాను కోరానని చెప్పారు. తన అభ్యర్థనకు కేజ్రీవాల్ ఆమోదం తెలపడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాగా, కేజ్రీవాల్ ఖాళీచేసిన అధికారిక బంగ్లాలోకి ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి వెళ్తారా లేదా అనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ముఖ్యమంత్రిగా అతిషి బాధ్యతలు చేపట్టినా, ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ కూర్చున్న కూర్చీలో ఆమె కూర్చోవడం లేదు. ఆ పక్కనే మరో కుర్చీలో కూర్చిన ఆమె బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో అతిషి ఇల్లు మారతారా లేదా అనేది సందేహంగానే ఉందంటున్నారు.

Also Read : AP High Court : ఆ కేసులో సజ్జలకు ఉరటనిచ్చిన ఏపీ హైకోర్టు

Leave A Reply

Your Email Id will not be published!