AP Govt : మాజీ సిఐడి చీఫ్ పీవీ సునీల్ కుమార్ పై ఏపీ సర్కార్ కీలక చర్యలు

ఈ మేరకు జీవో ఆర్టీ నెంబర్ 1695‌ను సర్కార్ విడుదల చేసింది...

AP Govt : వెయిటింగ్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పీవీ సునీల్ కుమార్‌పై ఛార్జెస్ ప్రేమ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ పోలిటికల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్ సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ సీఐడీ ఛీఫ్, అడిషన్ డీజీపీ, డీజీ సునీల్ కుమార్‌(PV Sunil Kumar)పై అఖిలభారత సర్వీసు నిబంధనలు 1969 ప్రకారం చార్జెస్ ప్రేమ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో ఆర్టీ నెంబర్ 1695‌ను సర్కార్ విడుదల చేసింది. అఖిత భారత సర్వీసు అధికారిగా ఉన్న పీవీ సునీల్ కుమార్ తన వివరణను లిఖిత పూర్వకంగా లేదా వ్యక్తిగతంగా 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. సమాధానం ఇచ్చే క్రమంలో ఎలాంటి రాజకీయ ఒత్తడి తెచ్చినా తీవ్ర పరిణామాలు ఉంటాయని ఉత్తర్వుల్లో వెల్లడించింది.

AP Govt Orders…

కాగా.. సోషల్ మీడియా (సామాజిక మాధ్యమం ఎక్స్ ) ద్వారా సునీల్ కుమార్ చేసిన ఆరోపణలపై నగరం పాలెం పోలీస్‌స్టేషన్‌లో టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వంపై ఈ ఏడాది జూలై 12న సోషల్ మీడియా ద్వారా సునీల్ తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు రఘురామ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో సునీల్‌పై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బదిలీ చేసి వెయిటింగ్‌లో ఉంచిన ప్రభుత్వం.. 15 రోజుల్లోపు అభియోగాలపై సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

Also Read : India-Maldives : కష్టమొస్తే ముందుండి ఆడుకుంటామంటూ అభయమిచ్చిన మోదీ

Leave A Reply

Your Email Id will not be published!