AP Weather : ఏపీలో 5 రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు
అక్డోబర్ 11న భారీవర్షలతో పాటు కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన కుంభవృష్టి పడనుంది...
AP Weather : ఆంధ్రప్రదేశ్‌కు చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ. ఒకటి కాదు రెండు కాదు.. వరుసగా ఐదు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. దసరా ముందు భారీ వర్షం దించకొట్టనుందన్నారు. దక్షిణ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోందని ఐఎండీ అధికారులు తెలిపారు. సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందన్నారు. దీని ప్రభావంతో ఏపీ(AP)లో రానున్న ఐదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఐఎండీ ప్రకారం.. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షం కురవనుంది.
AP Weather – కోస్తా ఆంధ్ర ప్రాంతంలో
అక్డోబర్ 11న భారీవర్షలతో పాటు కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన కుంభవృష్టి పడనుంది.
అక్టోబర్ 12న పిడుగులతో కూడిన కుంభవృష్టి.
అక్టోబర్ 13న పిడుగులతో కూడిన కుంభవృష్టి.
అక్టోబర్ 14న భారీ వర్షం, పిడుగులతో కూడిన కుంభవృష్టి.
అక్టోబర్ 15న అతి భారీ వర్షం తోపాటు పిడుగులతో కూడిన కుంభవృష్టి.
రాయలసీమ ప్రాంతంలో..
అక్టోబర్ 11న పిడుగులతో కూడిన కుంభవృష్టి.
అక్టోబర్ 12న పిడుగులతో కూడిన కుంభవృష్టి.
అక్టోబర్ 13న పిడుగులతో కూడిన కుంభవృష్టి.
అక్టోబర్ 14న అతి భారీ వర్షాతో పాటు పిడుగులతో కూడిన కుంభ వృష్టి.
అక్టోబర్ 15న అతి భారీ వర్షం.
అరేబియా సముద్రంలో ఒకటి, బంగాళాఖాతంలో 2 తుపాన్లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వీటి ప్రభావం ఏపీలో అధికంగా ఉంటుందని చెప్పారు. ఇవాళ్టి నుంచి కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.
Also Read : Minister Kishan Reddy : మూసి రిటర్నింగ్ వాల్ నిర్మాణంకై సీఎం రేవంత్ పై భగ్గుమన్న కేంద్ర మంత్రి