Baba Siddique : బాబా సిద్దిఖి ని చంపింది మేమె అంటూ సంచలన ప్రకటన

దీంతో హూటాహుటిన ఆయన్ను లీలావతి ఆస్పత్రికి తరలించారు...

Baba Siddique : ఎన్సీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య దేశవ్యా్ప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే సిద్ధిఖీని తామే హత్య చేసినట్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ ప్రకటించింది. ఈ కేసులో ప్రస్తుతం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోగా మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. బాబా సిద్ధిఖీ(Baba Siddique) రాజకీయ నాయకుడిగానే కాకుండా ప్రైవేటు పార్టీలు నిర్వహించడంలోనూ ముంబయి వ్యాప్తంగా ఆయనకు మంచి పేరుంది. ప్రముఖ నటులు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ మధ్య వివాదాన్ని కూడా ఈయన నిర్వహించిన పార్టీలోనే తీర్చారు. వారి మధ్య సంధి చేయడంలో బాబా సిద్ధిఖీ కీలక పాత్ర పోషించారు. సల్మాన్ ఖాన్‌కు బాబా సిద్ధిఖీ మంచి మిత్రుడు కూడా. ఆయన హత్య గురించి తెలియగానే బిగ్ బాస్ (హిందీ) షూటింగ్ మధ్యలో క్యాన్సిల్ చేసుకుని మరీ సల్మాన్ వచ్చారు. అయితే బాబా సిద్ధిఖీ హత్యకు కొన్ని నెలల నుంచే నిందితులు రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళ్తారు, ఏ సమయంలో ఎక్కడ ఉంటారనే పూర్తి సమాచారంతోనే హత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

Baba Siddique Murder..

హత్యకు రెక్కీ నిర్వహించిన నలుగురు దుండగులు శనివారం సాయంత్రం ముంబయి బాంద్రాలో సిద్ధిఖీ కుమారుడి కార్యాలయం వద్ద ఆయనపై కాల్పులకు తెగబడ్డారు. దసరా సందర్భంగా కార్యాలయం బయట ఆయన టపాసులు కాలుస్తుండగా ముఖానికి గుడ్డలు కట్టుకుని వచ్చి తుపాకులతో కాల్పులు జరిపారు. దీంతో హూటాహుటిన ఆయన్ను లీలావతి ఆస్పత్రికి తరలించారు. గుండెకు బులెట్ తగలడంతో చికిత్సపొందుతూ సిద్ధిఖీ(Baba Siddique) మృతి చెందారు. అయితే హత్యకు పాల్పడిన హరియాణాకు చెందిన కర్నైల్ సింగ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధర్మరాజ్ కశ్యప్‌ను పోలీసులు శనివారం నాడే అరెస్టు చేశారు.

వారు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌‌కు చెందిన వ్యక్తులుగా విచారణలో తేలినట్లు చెప్పారు. యూపీకి చెందిన మూడో నిందితుడు శివకుమార్‌ను ఇవాళ (ఆదివారం) రోజు అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. సిద్ధిఖీని చంపేందుకు ఒక్కొ నిందితుడికి లారెన్స్ గ్యాంగ్ రూ.50వేలు అడ్వాన్స్‌గా ఇచ్చిందని, అలాగే మారణాయుధాలు సైతం సమకూర్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇదే గ్యాంగ్ 2024 ఏప్రిల్‌లో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ ఇంటిపై కాల్పులు జరిపారు. తమ ఆరాధ్య జంతువు కృష్ణజింకను సల్మాన్ చంపడంతో వారు దాడి చేశారు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం ఆయన స్నేహితుడు బాబా సిద్ధిఖీని హత్య చేయడంతో సల్మాన్ ఇంటి వద్ద మరోసారి భారీగా భద్రత పెంచారు.

Also Read : AP Rains : రానున్న 4 రోజులు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

Leave A Reply

Your Email Id will not be published!