AP High Court : గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నో 24 ను కొట్టివేసిన హైకోర్టు

ఈ పిటిషన్‌పై ఈరోజు (మంగళవారం) హైకోర్టులో విచారణ జరుగగా.....

AP High Court : ప్రైవేట్ అన్ ఎయిడెడ్ విద్యా సంస్థలలో ఒకటో తరగతిలో 25 శాతం విద్యార్థులకు రిజర్వేషన్ ఇవ్వాలంటూ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు(AP High Court) కొట్టివేసింది. అమ్మఒడి ఇస్తుండటంతో ఒకటో తరగతిలో 25 శాతం వరకు పిల్లలను చేర్చుకోవాలని 2023-34 సంవత్సరంలో జీవో నెంబర్ 24ను గత ప్రభుత్వం జారీ చేసింది. 2022-23 సంవత్సరంలో ఈ ఆదేశాలపై జారీ చేసిన మెమోను కోర్టులో విద్యా సంస్థలు సవాల్ చేశాయి. కోర్టులో విచారణ జరుగుతుండగానే 2023-24 సంవత్సరంలో ఒకటో తరగతిలో 25 శాతం మంది పిల్లలను ప్రభుత్వం సూచించిన వారిని చేర్చుకోవాలని జీవో జారీ అయ్యింది. ఈ జోవోను సవాల్ చేయడంతో అప్పట్లో అడ్మిషన్లు అన్నీ తుది తీర్పుకు లోబడి ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది.

AP High Court Order…

ఈ పిటిషన్‌పై ఈరోజు (మంగళవారం) హైకోర్టులో విచారణ జరుగగా… జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 24ను కొట్టివేస్తూ న్యాయస్థానం తుది తీర్పు ఇచ్చింది. ఈ జోవో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యా హక్కు చట్టానికి పూర్తి భిన్నంగా ఉందని తీర్పులో పేర్కొంది. జీవో నెంబర్ 24 అన్ని చట్టాలను కూడా ఉల్లంఘించే విధంగా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే జగన్ ప్రభుత్వం అనాలోచిత చర్యలతో 15 వేల మంది విద్యార్థుల భవితవ్యం అయోమయంలో పడిందన్నారు. వీరిని కొనసాగించాలా లేదా అనే అంశంపై గందరగోళం నెలకొంది. రెండు సంవత్సరాలు చదువు చెప్పినందుకు ఫీజు ఎవరిస్తారని విద్యా సంస్థలు అడుగుతున్న పరిస్థితి.

Also Read : Kadambari Jethwani : జేత్వాని కేసులో పోలీసు అధికారుల బెయిల్ పై విచారణ వాయిదా

Leave A Reply

Your Email Id will not be published!