IND vs NZ : హాఫ్ సెంచరీలతో అరుదైన రికార్డు సృష్టించిన పంత్
87 ఇన్నింగ్స్ లో 50కి పైగా 18 సార్లు హాఫ్ సెంచరీలు చేసి ఫరూక్ రికార్డు నెలకొల్పాడు...
IND vs NZ : ఇప్పట్లో అసలు బ్యాటింగ్ కు రాగలడా అని అంతా అనుకుంటున్న సమయంలో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ అందరి అంచనాలు తలకిందులు చేశాడు. నాలుగో రోజు బ్యాటింగ్‌కు దిగడమే కాకుండా వరుస షాట్లతో సత్తా చాటాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో సర్ఫరాజ్‌తో కలిసి భారత్‌ను గట్టెక్కించడంలో పంత్(Rishab Panth) చాలా వరకు విజయం సాధించాడు. తాజాగా ఈ యువ వికెట్ కీపర్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. హాఫ్ సెంచరీల్లో భారత మాజీ బ్యాట్స్‌మెన్ ఫరూక్ ఇంజనీర్‌ను సమం చేశాడు. టెస్టుల్లో అత్యధికంగా 50+ స్కోర్లు సాధించిన భారత ఆటగాళ్లలో పంత్ రెండో బ్యాట్స్‌మెన్ గా నిలిచాడు. 87 ఇన్నింగ్స్ లో 50కి పైగా 18 సార్లు హాఫ్ సెంచరీలు చేసి ఫరూక్ రికార్డు నెలకొల్పాడు. ఇప్పుడీ రికార్డును బ్రేక్ చేస్తూ పంత్ కేవలం 62 ఇన్నింగ్స్ లోనే 50 కి పైగా 18 సార్లు స్కోర్ చేశాడు. 144 ఇన్నింగ్స్ లో 39 స్కోర్ చేసి ఎంఎస్ ధోనీ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.
IND vs NZ Match UpdIND vs NZ
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ అద్భుత ప్రదర్శన చేసి తన టెస్ట్ కెరీర్లో 12వ అర్ధ సెంచరీని నమోదు చేశాడు. నాలుగో రోజు బ్యాటింగ్‌కు దిగిన పంత్.. సర్ఫరాజ్ ఖాన్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తొలి టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు వికెట్ కీపింగ్‌లో పంత్ జడేజా వేసిన బంతికి గాయపడి మైదానాన్ని వీడాల్సి వచ్చిన సంగతి తెలిసిందే.
రవీంద్ర జడేజా వేసిన బంతిని డెవాన్ కాన్వే మిస్ చేయడంతో పంత్ గాయపడ్డాడు. బంతిని సరిగ్గా క్యాచ్ చేయలేక పోవడంతో అది నేరుగా అతని కుడి కాలికి తగిలింది. 2022 డిసెంబర్లో జరిగిన కారు ప్రమాదంలో పంత్‌కు తీవ్రగాయాలు కాగా, అతని కుడి కాలికి గాయమైన సంగతి తెలిసిందే. జడేజా వేసిన బంతి స్టంప్‌ను తప్పి పంత్ కాలికి తగలడంతో నొప్పితో బాధపడుతూ ఫిజియో సహాయంతో మైదానం నుంచి బయటకు వెళ్లాడు. పంత్ మూడో రోజు కూడా వికెట్ కీపింగ్ కోసం రాలేదు మరియు అతని స్థానంలో ధృవ్ జురెల్ ఈ బాధ్యతను తీసుకున్నాడు.
Also Read : Minister Bandi Sanjay : కేంద్రమంత్రి బండి సంజయ్ అరెస్ట్..అశోక్ నగర్ లో హై టెన్షన్