Benjamin Netanyahu : ఇజ్రాయెల్ ప్రధాని టార్గెట్ గా ఇంటిపై డ్రోన్లతో దాడులు

దీనికి ముందు, ఇజ్రాయెల్ మిలటరీ దీనిపై మాట్లాడుతూ, లెబనాన్ నుంచి మూడు డ్రోన్లు దూసుకువచ్చాయని తెలిపింది...

Benjamin Netanyahu : సంస్థ హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తుదముట్టడించిన కొద్ది గంటలకే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహు(Benjamin Netanyahu) ఇంటిని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి జరిగింది. ఇజ్రాయెల్‌లోని సిజేరియా టౌన్‌లో ఉన్న నేతన్యాహు నివాసం వైపు డ్రోన్ దూసుసువచ్చినట్టు నెతహన్యూహు ప్రతినిధి ఒకరు శనివారంనాడు తెలిపారు. ఆ సమయంలో ప్రధాని ఆ చుట్టుపక్కల లేరని, ఆయన నివాసంపై దాడిలో ఎవరూ గాయపడలేదని చెప్పారు. ” ప్రధాని నివాసంపై యూఏవీని ప్రయోగించారు. ఆ సమయంలో ప్రధాని, ఆయన భార్య అక్కడ లేకపోవడంతో ఎవరూ గాయపడలేదు” అని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దీనికి ముందు, ఇజ్రాయెల్ మిలటరీ దీనిపై మాట్లాడుతూ, లెబనాన్ నుంచి మూడు డ్రోన్లు దూసుకువచ్చాయని తెలిపింది. రెండు డ్రోన్‌లను మధ్యలోనే అడ్డుకోగా, ఒక డ్రోన్ సిజేరియాలోని భవవాన్ని ఢీకొన్నట్టు చెప్పింది. కాగా, డ్రోన్ దాడులకు తామే కారణమని హెజ్‌బొల్లా ఇంకా ప్రకటించ లేదు.

Benjamin Netanyahu….

సిన్వర్‌ను మట్టుబెట్టడాన్ని కీలక విజయంగా ప్రకటించిన ఇజ్రాయెల్ శుక్రవారం రాత్రి సైతం గాజాపై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడిలో 33 మంది పాలస్తీనా వాసులు మరణించడంతో ఇప్పటివరకూ ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన వారి సంఖ్య 42 వేలకు చేరిందని గాజా అధికారులు ప్రకటించారు. ఆయుధాలు విడిచిపెట్టి, బందీలను విడిచిపెట్టేంత వరకూ యుద్ధం ఆపేది లేదని నెతన్యాహూ ప్రకటించారు.

Also Read : IND vs NZ : హాఫ్ సెంచరీలతో అరుదైన రికార్డు సృష్టించిన పంత్

Leave A Reply

Your Email Id will not be published!