KTR : కాంగ్రెస్, బీజేపీ నేతల రహస్య ఒప్పందాలు బయటకు వస్తాయి
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అశోక్ నగర్‌కు వచ్చి వార్షికోత్సవం జరుపుకోవాలని ఎద్దేవా చేశారు...
KTR : సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్‌లు రహస్య మిత్రులని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(KTR) సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ కుర్చీ పోతుంటే బండి సంజయ్‌కు అంత బాధ ఎందుకని ప్రశ్నించారు. బండి సంజయ్ కామెంట్లపై స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలవి రహస్య ఒప్పందాలని.. ఖచ్చితంగా బయటకు వస్తాయని కేటీఆర్(KTR) అన్నారు.
KTR Slams..
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అశోక్ నగర్‌కు వచ్చి వార్షికోత్సవం జరుపుకోవాలని ఎద్దేవా చేశారు. ఇవాళ(సోమవారం) తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్(KTR) మీడియాతో మాట్లాడుతూ… ముత్యాలమ్మ గుడిపై దాడిని తాను ఖండిస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. తాను ట్వీట్ చేసినందుకు సైబర్ క్రైమ్ అధికారులు లేఖ పంపారని అన్నారు. రేవంత్‌రెడ్డి లాంటి దగుల్బాజీ ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేరని విమర్శించారు. ఉద్యోగాల కల్పనపై సీఎం రేవంత్ అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. మూసీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ కంటే జర్నలిస్టులే ఎక్కువ ప్రశ్నించాలని కేటీఆర్ అన్నారు.
రేవంత్ ప్రభుత్వం లక్షన్నర కోట్లు మూసీలో పోద్దామంటే చూస్తూ ఊరుకుందామా? అని నిలదీశారు. లక్షన్నర కోట్లు రేవంత్ జేబులో వేసుకుంటామంటే ఊరుకుంటామా? అని అడిగారు. జర్నలిస్ట్‌లపై బీఆర్ఎస్ పార్టీకి ఎనలేని గౌరవం ఉందని.. ఎన్నడూ తాను జర్నలిస్ట్‌లను అవమానించలేదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో తమకంటే జర్నలిస్టుల పాత్ర ఎక్కువగా ఉందని చెప్పారు. మూసీ కోసం ప్రభుత్వం పెడుతున్న తంటాలు చూస్తుంటే బాధకలుగుతోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసంబద్ధమైన నిర్ణయాలు తీసుకోవడం రాష్ట్ర పురోగతికి గొడ్డలి పెట్టు అని విమర్శించారు. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు వెనక్కి తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఫిక్స్‌డ్ చార్జీలను రూ.10నుంచి రూ.50కు పెంచాలని ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. ఇప్పటికే కరెంటు కోతలతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్(KTR) ఆందోళన వ్యక్తం చేశారు.
‘‘రేవంత్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో పరిశ్రమలు తెలంగాణ నుంచి తరలిపోతున్నాయి. విద్యుత్ చార్జీలు పెంచి రూ. 18వేల 500కోట్ల రూపాయల అదనపు భారాన్ని ప్రజలపై ప్రభుత్వం మోపనుంది. చార్జీల పెంపునకు 9ప్రతిపాదనలను కాంగ్రెస్ ప్రభుత్వం విరమమించుకోవాలి. ఇళ్లల్లో వాడుకునే కరెంట్‌కు 300యూనిట్లు దాటితే 10రూపాయలు ఉన్న పిక్స్‌డ్ చార్జిను 50రూపాయలు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. పరిశ్రమల అన్నిటినీ ఒకటే కేటగిరి కిందకు తీసుకురావాలనుకోవటం దుర్మార్గం. కాంగ్రెస్ చేతకానితనంతో ఫాక్స్‌కాన్ పరిశ్రమ తెలంగాణ నుంచి తరలిపోయింది. మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో విద్యుత్‌లో తెలంగాణ నంబర్ వన్‌గా ఉండేది. ఈనెల 23న ఈఆర్సీ నిర్వహిస్తోన్న పబ్లిక్ హియరింగ్‌కు బీఆర్ఎస్ బృందం హాజరవుతోంది. ప్రభుత్వాన్ని నడిపేవారికి పట్టువిడుపులు ఉండాలి’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
‘ప్రభుత్వం పట్టుదలకు పోవటంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. రిట్ ఫిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకునే వరకు ఫలితాలు వెల్లడించవద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. రిట్ పిటిషన్‌పై వేగంగా వాదనలు విని నిర్ణయం తీసుకోమని సుప్రీం హైకోర్టుకు చెప్పింది. జీవో నెంబర్ 29కు వ్యతిరేకంగా హైకోర్టులో అభ్యర్థుల తరుపున కొట్లాడుతాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణలో అధికారంలోకి తీసుకువచ్చిందే నిరుద్యోగులు. లోకల్స్ కోసం కేసీఆర్ 95శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చారు. తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రమాణికం కాదని చెప్పటం అన్యాయం. జీవో నెంబర్ 29తో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు విఘాతం. గ్రూప్ – 1 అభ్యర్థుల తరుపున సుప్రీంకోర్టులో కేసు వేసిందే బీఆర్ఎస్. కపిల్ సిబల్ లాంటి ప్రముఖ న్యాయవాదిని తాము నియమించాం’’ అని కేటీఆర్ వెల్లడించారు.
Also Read : MP Eatala Rajender : హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకునేది లేదు