Jharkhand Elections : ఆపరేషన్ హేమంత్ సోరెన్ తో మారుతున్న ఊహాగానాలు..

మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి జేఎంఎంతో కలిసి పోటీ చేస్తుండగా....

Jharkhand : హర్యానాలో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరంటూ ఎన్నికల ముందు వరకు ప్రచారం సాగింది. పోలింగ్ తర్వాత సర్వే సంస్థలు సైతం కాంగ్రెస్ గెలుపు పక్కా అంటూ అంచనాలు వెల్లడించాయి. వాస్తవ ఫలితాలు మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేశాయి. బీజేపీ అధికారానికి అవసరమైన మెజార్టీ మార్క్‌ను సాధించింది. ప్రస్తుతం జార్ఖండ్‌ శాసనసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. జార్ఖండ్‌(Jharkhand)లో ఈసారి బీజేపీ కూటమి గెలిచే అవకాశం ఉందంటూ ఎన్నికల షెడ్యూల్ ముందువరకు ప్రచారం జరిగింది. ఇప్పటికీ తాము గెలుస్తామని బీజేపీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి జేఎంఎంతో కలిసి పోటీ చేస్తుండగా.. తాము వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. విజయంపై రెండు కూటములు నమ్మకంగా ఉన్నాయి. ఈదశలో సీఎం హేమంత్ సోరెన్ బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో తనపై బీజేపీ నుంచి పోటీచేస్తారంటూ ప్రచారంలో ఉన్న వ్యక్తిని ఏకంగా తన పార్టీలో చేర్చుకోవడం ద్వారా కమలనాధులను కలవరపాటుకు గురిచేశారు. బీజేపీలో కీలక నాయకులను తమవైపు తిప్పుకోవడం ద్వారా ఎన్నికల చివరి క్షణంలో ఆ పార్టీకి హేమంత్ సోరెన్ ఝలక్ ఇచ్చారు.

Jharkhand Election

2014 జార్ఖండ్‌(Jharkhand) అసెంబ్లీ ఎన్నికల్లో బరేహత్ నుంచి బరిలోకి దిగిన హేమంత్ సోరెన్‌పై బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన లూయిస్ మరాండీ గెలుపొందారు. దీంతో ఆమె అందరి దృష్టిని ఆకర్షించారు. బీజేపీలో సీనియర్‌ నేతగా ఉన్న ఆమెను ఈసారి ఎన్నికల్లో కూడా హేమంత్ సోరెన్ బరేహత్ నుంచి పోటీచేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో బీజేపీ నుంచి మరెసారి లూయిస్ మరాండీని అభ్యర్థిగా నిలపాలని కమలనాధులు ప్లాన్ చేశారు. ఈలోపు ఆపరేషన్ హేమంత్ సోరెన్ పేరుతో లూయిస్ మరాండీతో పాటు పలువురు బీజేపీ నాయకులను జేఎంఎం తమవైపు తిప్పుకుంది. బీజేపీని వీడి జార్ఖండ్ ముక్తి మోర్చాలో చేరిన తర్వాత హేమంత్ సోరెన్ కోరిన చోట నుంచి పోటీచేస్తానని లూయిస్ మరాండీ ప్రకటించారు. దుమ్కా లేదా జామా నుంచి లూయిస్ మరాండీ పోటీచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లూయిస్‌తో పాటు ఆరుగురు సీనియర్ బీజేపీ నేతలను జేఎంఎం ఆకర్షించింది. పార్టీలో చేరిన తర్వాత సీఎం హేమంత్ సోరెన్‌ను నేతలంతా కలిశారు.

లూయిస్ మరాండీతో పాటు గణేష్ మహలి, కునాల్ షడంగీ, బాస్కో బెహెరా, బారీ ముర్ము, లక్ష్మణ్ తుడు జార్ఖండ్(Jharkhand) ముక్తి మోర్చాలో చేరారు. మాజీ ఎమ్మెల్యే చున్నా సింగ్ కూడా పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తనకు టికెట్ కేటాయించకపోవడంపై చున్నా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వరుసగా రెండోసారి గెలుపే లక్ష్యంగా జేఎంఎం, కాంగ్రెస్ కూటమి పావులు కదుపుతోంది. దీనిలో భాగంగా బీజేపీ కీలక నేతలను ఆకర్షించడం ద్వారా ఆయా నియోజకవర్గాల్లో కమలం పార్టీని దెబ్బతీసే ప్లాన్‌తో జేఎంఎం ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ హేమంత్ సోరెన్ ఎన్నికల్లో ఎలా పనిచేస్తుందనేది.. ఫలితాల తర్వాత తేలనుంది.

Also Read : TG Ministers : సియోల్ లో తెలంగాణ మంత్రుల 2వ రోజు బిజీ బిజీ పర్యటన

Leave A Reply

Your Email Id will not be published!