Sakshi Malik : దశాబ్ద కాలం నుంచి బ్రీజ్ బుసాన్ తో లైంగిక వేధింపులకు ఇబ్బంది పడ్డాను
తన తల్లిదండ్రులతో ఫోన్ లో మాట్లాడేందుకు ఆయన నన్ను తన హోటల్ గదిలోకి పిలిపించుకున్నాడు...
Sakshi Malik : రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ సింగ్(Brij Bhushan) చేతిలో తాను దశాబ్ద కాలానికి పైగా లైంగిక వేధింపులకు గురైనట్టు రెజ్లర్ సాక్షి మాలిక్(Sakshi Malik) సంచలన విషయాలను వెల్లడించింది. జీవితంలో ఇవి అత్యంత విషాదకర విషయాలుగా ఆమె తన ఆటో బయోగ్రఫీ ’విట్నెస్‘లో రాసుకొచ్చింది. 2012 లో కజకిస్తాన్ లో జరుగుతున్న ఆసియా జూనియర్ చాంపియన్షిప్ సమయంలో బ్రిజ్ భూషన్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు తెలిపింది.
Sakshi Malik Comment
’తన తల్లిదండ్రులతో ఫోన్ లో మాట్లాడేందుకు ఆయన నన్ను తన హోటల్ గదిలోకి పిలిపించుకున్నాడు. మావాళ్లతో మాట్లాడటానికే కదా అని నేను వెళ్లడానికి సంకోచించలేదు. వారికి కాసేపు నా మెడల్స్ మ్యాచెస్ గురించి చెప్పాడు. కానీ, ఫోన్ పెట్టేసిన వెంటనే అతడి బెడ్ పై కూర్చున్న నాతో అనుచితంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. వెంటనే నేను అతడిని వెనక్కి నెట్టేసి గట్టిగా ఏడ్వడం మొదలుపెట్టాను. అతను కోరుకున్నది నానుంచి సాధించుకోలేనని అర్థమై అతను వెనక్కి తగ్గాడు. నా భుజాల చుట్టూ చేతులు వేస్తూ నీ తండ్రి లాంటి వాడినంటూ చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ, అతని దురుద్దేశం నాకప్పటికే అర్థమైంది. వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ నా గదిలోకి వచ్చేశాను‘ అంటూ సాక్షి తన ఆవేదనను పంచుకుంది. ఇదొక్కటే కాదని.. తను చిన్ననాటి నుంచే లైంగిక వేధింపుల బాధితురాలినని తెలిపింది.
చిన్నప్పుడు ట్యూషన్ టీచర్ సైతం తనను ఎంతో వేధించేవాడని తెలిపింది. కొన్నిసార్లు క్లాసులకు వెళ్లేందుకే భయపడేదాన్నని చెప్పింది. ఎన్నో సార్లు తన తల్లి తనకు మద్దతుగా నిలిచిందని తన బయోగ్రఫీలో రాసుకొచ్చింది. బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా రెజ్లర్లంతా సుదీర్ఘ నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. అనంతరం సాక్షి రెజ్లింగ్ నుంచి తప్పుకుంది. ఉద్యమం నీరుకారడానికి తన తోటి రెజ్లర్ల మనసు మార్చేందుకు జరిగిన ప్రయత్నాలను సైతం ఆమె అందులో పొందుపరిచింది.
Also Read : Minister Ram Mohan Naidu : ప్రపంచానికే డ్రోన్ హబ్ గా ఏపీ – కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు