Hydra-Ranganath : అనుమతులుంటే బిల్డింగ్ బిల్డింగ్ కూల్చం
అనుమతులుంటే బిల్డింగ్ బిల్డింగ్ కూల్చం..
Ranganath : ప్రభుత్వ అనుమతులున్న భవనాలను హైడ్రా కూల్చదని.. సర్వే నంబర్లు మార్చి, తప్పుడు సమాచారంతో అనుమతులు పొంది, భూములు, చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై మాత్రమే చర్యలు ఉంటాయని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. నగరవాసులకు మెరుగైన జీవనాన్ని కల్పించేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా వందరోజులు పూర్తి చేసుకున్నదని కమిషనర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Ranganath Comment
అక్రమ నిర్మాణాలు కూల్చిన తర్వాత ఆ వ్యర్థాలను సదరు బిల్డరే తొలగించాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విలువైన వస్తువులను తీసుకెళ్లి మిగతా వ్యర్థాలను వదిలేయడాన్ని హైడ్రా తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు. ఒకవేళ తామే తొలగిస్తే అందుకయ్యే వ్యయాన్ని నిర్మాణదారుడి నుంచి వసూలు చేస్తామన్నారు.
Also Read : Minister Nimmala : మాజీ సీఎం వివాదంలో టీడీపీ ఎందుకు జోక్యం చేసుకుంటుంది