Minister Ponnam : అమరవీరుల స్తూపం దగ్గరకు వస్తారా అంటూ కేంద్ర మంత్రులకు సవాల్ విసిరిన పొన్నం

అయితే వరదల వల్ల రూ. 10 వేల కోట్ల నష్టం జరిగితే....

Minister Ponnam : తెలంగాణలోని ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిప్పులు చెరిగారు. సోమవారం గాంధీభవన్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam) విలేకర్లతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. రాష్ట్రం నుంచి మోదీ కేబినెట్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ తెలంగాణకు ఏం ప్రయోజనాలు చేకూర్చారని ప్రశ్నించారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి మమ్మల్ని ప్రశ్నించే ముందు గత పదేళ్లలో రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి రాష్ట్రానికి చేసింది శూన్యమని ఆయన గుర్తు చేశారు. తెలంగాణకు గత దశాబ్ద కాలంలో ఏం చేసిందో చెప్పాలంటూ కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam) సూటిగా సవాల్ విసిరారు. అమర వీరుల స్థూపం వద్ద చర్చకు రావాలని వారిద్దరకు పొన్నం ప్రభాకర్ ఈ సందర్బంగా సూచించారు. ఈ కేంద్ర మంత్రులు ఇద్దరిలో తెలంగాణ డీఎన్‌ఏ ఉంటే ఏమైనా చేసే వారని.. కానీ వారిలో అది లేదంటూ మంత్రి పొన్నం ఎద్దేవా చేశారు.

Minister Ponnam Challange

రాష్ట్రంలో వరద నష్టంపై నివేదికను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు తమ ప్రభుత్వం అందజేసిందని గుర్తు చేశారు. అయితే వరదల వల్ల రూ. 10 వేల కోట్ల నష్టం జరిగితే.. కేంద్రం మాత్రం కేవలం రూ. 4 వందల కోట్లు మాత్రమే సాయం చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను బిఅర్‌ఎస్ పార్టీ రెచ్చకొట్టే కార్యక్రమం ముగిశాక.. వారికి న్యాయం చేయడానికి తాము వెళతామన్నారీ మంత్రి పొన్నం ప్రభాకర్.

ఇక రాష్ట్రంలోని సర్పంచ్‌ల అంశంపై బీఆర్ఎస్ నేతల చేస్తున్న ఆరోపణలపై సైతం మంత్రి పొన్నం స్పందించారు. వంద ఎలుకలు తిన్న పిల్లి మాదిరిగా బీఆర్ఎస్ నేతలు రాష్ట్రంలో సర్పంచుల గురించి మాట్లాడ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బిఆర్ఎస్ హయాంలో సర్పంచుల ఆత్మహత్యలకు కారణం అయిన వారే.. నేడు వారికి మద్దతుగా ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సర్పంచులు ఆందోళన చెందాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని స్పష్టం చేశారు. సర్పంచులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషయం అందరికి తెలుసునని చెప్పారు. కాస్తా ఓపిక పట్టాలని ఈ సందర్భంగా సర్పంచులకు మంత్రి పొన్నం(Minister Ponnam) సూచించారు. వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి బకాయిలు చెల్లిస్తామని రైతులకు మంత్రి స్పష్టం చేశారు. సర్పంచుల బకాయిలు చెల్లించేందుకు తమ ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందన్నారు. పొలిటికల్ పార్టీల ట్రాప్‌లో పడకండంటూ తెలంగాణలోని సర్పంచులకు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ హితవు పలికారు.

Also Read : PM Modi : డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తే అభివృద్ధి రెట్టింపు అవుతుంది

Leave A Reply

Your Email Id will not be published!