Sharad Pawar : ఎన్నికల్లో పోటీపై కీలక అంశాలను వెల్లడించిన శరద్ పవార్
''నేనుఅధికారంలో లేను. రాజ్యసభలో ఉన్నాను. మరో ఏడాదిన్నర పాటు పదవిలో ఉంటాను...
Sharad Pawar : భవిష్యత్తులో జరిగే ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయరాదని తాను అనుకుంటున్నట్టు నేషనల్ కాంగ్రెస్ పార్టీ సుప్రీం శరద్ పవార్(Sharad Pawar) సంచలన ప్రకటన చేశారు. బారామతిలో ఎన్‌సీ (ఎస్‌పీ) అభ్యర్థి, తన మనుమడు యుగేంద్ర పవార్ తరఫు మంగళవారంనాడు ఎన్నికల ర్యాలీలో పవార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 14 సార్లు తాను ఎన్నికల్లో పోటీ చేసానని, ప్రస్తుత రాజ్యసభ పదవీకాలం ముగిసిన తర్వాత పార్లమెంటరీ స్థానాన్ని విడిచిపెట్టాలా వద్దా అనే దానిపై ఆలోచిస్తానని చెప్పారు. ప్రజా సేవ చేసేందుకు ఎన్నికల్లో గెలవాల్సిన పని లేదని, కొత్త తరానికి బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం ఉందని అన్నారు.
Sharad Pawar Comments…
”నేనుఅధికారంలో లేను. రాజ్యసభలో ఉన్నాను. మరో ఏడాదిన్నర పాటు పదవిలో ఉంటాను. ఇప్పటికే 14 సార్లు ఎన్నికల్లో పోటీ చేశాను. ఇంకెన్ని చేయాలి? ఎన్నికలు ఏవైనా ప్రజలు నన్ను గెలిపిస్తూనే వచ్చారు. ఇక ఎక్కడో ఒకచోట ఆగాలి. కొత్త తరాన్ని ముందుకు తీసుకురావాలి. నేను పోటీకి దూరంగా ఉన్నంత మాత్రాన సామాజిక సేవ వదులుకున్నట్టు కాదు. సామాజిక సేవను కొనసాగిస్తూనే ఉంటాను. ముఖ్యంగా గ్రామీణ, గ్రామీణ ప్రాంతాలు, ఆదివాసీల కోసం పనిచేస్తా” అని పవార్ చెప్పారు. తన రాజకీయ జర్నీ గురించి పవార్ వివరిస్తూ, 30 ఏళ్ల క్రితం జాతీయ రాజకీయాలకే పరిమితమై, రాష్ట్ర బాధ్యతను అజిత్ పవార్‌కు అప్పగించాలనని అనుకున్నానని చెప్పారు. సుమారు ఈ 25-30 ఏళ్లు రాష్ట్ర బాధ్యత తానే మోయాల్సి వచ్చిందని, వచ్చే 30 ఏళ్ల కోసం ఏర్పాట్లు చేయాల్సి ఉందని అన్నారు. పవార్ రాజ్యసభ సభ్యత్వం 2026లో ముగియనుంది.
బారామతినియోజకవర్గం పవార్ కుటుంబానికి ఏళ్ల తరబడి కంచుకోటగా నిలుస్తోంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కుటుంబ సభ్యుల మధ్యే పోటీ నెలకొంది. ఏడుసార్లు ఇక్కడి నించి ఎమ్మెల్యేగా ఎన్నికైన అజిత్ పవార్, ఆయన మేనల్లుడు యుగేంద్ర పవార్ ఇక్కడ ముఖాముఖీ తలబడుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో నవంబర్ 20న జరుగనుండగా, 23న ఫలితాలు వెలువడతాయి.
Also Read : Dubai Weather : ఎప్పుడు ఎండలతో మండిపోయే దుబాయ్ లో ఇప్పుడు మంచు