AP CID : మదనపల్లి ఫైళ్ల దహనం కేసు ఇన్వెస్టిగేషన్ లో దూకుడు పెంచిన సీఐడీ
మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత అనుచరుడుగా ఆర్డీవో మురళి వ్యవహరించారు...
AP CID : మదనపల్లి సబ్ కలెక్టరేట్‌లో ఫైళ్ల దహనం కేసులో ఎంతటి దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. ఈ కేసును ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. మరోవైపు మదనపల్లి సబ్ కలెక్టరేట్‌లో పైళ్ల దహనం కేసు విచారణలో సీఐడీ(CID) అధికారులు దూకుడు పెంచారు. ఫైళ్ల దహనం కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న పూర్వపు ఆర్డీవో మురళికి చెందిన నివాసాలలో శనివారం ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మదనపల్లి పట్టణంలోని ప్రశాంత్ నగర్‌లోని మురళి నివాసంతో పాటు, తిరుపతిలో ఆయన కుమారుడు నివసిస్తున్న ఇంటిలోను ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో ఫ్రీ హోల్డ్ భూములను నిషేధిత జాబితాలో నుంచి తొలగించడంలో మురళి కీలక పాత్ర పోషించారనే అభియోగాలు ఉన్నాయి.
AP CID Investigation..
మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత అనుచరుడుగా ఆర్డీవో మురళి వ్యవహరించారు. ఈయన హయాంలోనే, ఫోర్జరీ సంతకాలతో వైసీపీ ప్రధాన నాయకులు పేదల నుంచి బలవంతంగా కొనుగోలు చేసిన భూములను ఫ్రీ హోల్డ్ జాబితాలో ఎక్కించడంలో ఆర్డీవో మురళి కీలక పాత్ర పోషించారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. జూలై 21వ తేదీన మదనపల్లి సబ్ కలెక్టరేట్‌లో ఫైళ్ల దహనం జరిగిన ఘటనను టీడీపీ కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు, అప్పటి సీఐడీ(CID) చీఫ్ రవిశంకర్ అయ్యాన్నార్ ప్రత్యేక హెలికాప్టర్లో మదనపల్లికి చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించిన విషయం తెలిసిందే.
రెవెన్యూ స్పెషల్ చీప్ సెక్రటరీ సిసోడియా మదనపల్లిలోనే రెండు రోజులు మకాం వేసి వైసీపీ నాయకుల భూ కబ్జాల విషయమై ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. గత నాలుగు నెలల కాలం నుంచి సీఐడీ అధికారులు ఈ కేసు విషయమై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో పూర్వపు ఆర్డీవో మురళి ఇళ్లపై మదనపల్లి తిరుపతి ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. సబ్ కలెక్టరేట్‌లో ఫైలు దహనం ఘటనలో 8 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరి ఇళ్లలో కూడా త్వరలో తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం.
Also Read : Pawan Kalyan : ఏలూరు జిల్లా గ్రావెల్ అక్రమ తవ్వకాలపై భగ్గుమన్న డిప్యూటీ సీఎం