Harish Rao : సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో ప్రతి వర్గం చాలా నష్టపోయింది
అలాగేవికారాబాద్ జిల్లాలో జరిగిన ఘటనపై మాజీ మంత్రి స్పందించారు...
Harish Rao : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.మంగళవారం మీడియాతో మాట్లాడుతూ. కాంగ్రెస్ వల్ల తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో చెప్తాం.. చర్చకు వస్తావా అంటూ సవాల్ విసిరారు. రేవంత్ ఏడాది పాలనలో ప్రతి వర్గం ఎంతో నష్ట పోయిందన్నారు. ‘‘సోయి తెచ్చుకో రేవంత్ రెడ్డి.. దేవుడి మీద ఒట్టు వేసినవ్.. రుణమాఫీ చెయ్యి’’ అంటూ డిమాండ్ చేశారు.సన్నాలకే బోనస్ అంటూ సన్నాయి రాగాలు తీయవద్దన్నారు. వానకాలంలో రైతు భరోసా ఇవ్వలేదని… కనీసం యాసంగికి అయినా ఇస్తావా లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ లేకపోతే రేవంత్‌కు సీఎం పదవే లేదన్నారు. వ్యవసాయం, తాగు నీరు, విద్య, వైద్యం, నేతన్నల మీద చర్చకు వస్తావా అని ఛాలెంజ్ విసిరారు. ‘‘రైతులు రోడ్డెక్కారు.. విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారు.. ఇదేనా నీ పాలన’’ అంటూ హరీష్ రావు ఫైర్ అన్నారు.
Harish Rao Slams..
అలాగేవికారాబాద్ జిల్లాలో జరిగిన ఘటనపై మాజీ మంత్రి స్పందించారు. ఈ సందర్భంగా రేవంత్ సర్కార్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వ తీరు అమానుషమని … లగచర్ల వాసులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.లగచర్ల గ్రామానికి 300 మంది పోలీసులు చేరుకొని గ్రామస్థులను అరెస్టు చేయడం దారుణమన్నారు. ఫార్మా భూ సేకరణకు నిరాకరించిన వాళ్ళను పోలీసులతో బెదిరించాలని చూడడం సరికాదన్నారు. అర్ధరాత్రి పోలీసులతో ప్రభుత్వం దమనకాండ నిర్వహించడం సరైందికాదని.. ప్రభుత్వం తీరును ఖండిస్తున్నామని, ప్రజాభిప్రాయాన్ని తీలుసుకోకుండా భూసేకరణ చేపట్టడం వెనుక ఉన్న రేవంత్ రెడ్డి ఉద్దేశ్యం తెలియాలన్నారు. ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేపడుతున్న భూసేకరణను తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేశారు.పోలీసుల అదుపులో ఉన్న గ్రామస్థులను, రైతులను తక్షణం విడుదల చేయాలని హరీష్‌రావు మరోసారి డిమాండ్ చేశారు.
Also Read : YS Sharmila : ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపే హక్కు మాజీ సీఎంకు లేదా..