KTR : పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ పై వారి ఫ్యామిలీకి వెర్బల్ గ మాట్లాడి ధర్యం చెప్పిన కేటీఆర్
ప్రజా ప్రతినిధులకు ఎందరో ఫోన్లు చేస్తుంటారని.....
KTR : వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేసులో అరెస్ట్ అయిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఫోన్లో మాట్లాడారు. అక్రమ అరెస్టుపైన ఆందోళన చెందవద్దని ధైర్యంగా ఉండాలని ఆయన కోరారు. ప్రభుత్వ అప్రాజస్వామిక నియంత విధానాలపైన పార్టీ న్యాయపరంగా పోరాటం చేస్తూనే ఉంటుందని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. అలాగే నరేందర్ రెడ్డి సతీమణి శృతితో కూడా మాజీ మంత్రి సంభాషించారు. ‘‘బీఆర్ఎస్ పార్టీ మొత్తం మీ కుటుంబానికి అండగా ఉంటుంది’’ అని భరోసా ఇచ్చారు. పార్టీ లీగల్ సెల్ నరేందర్ రెడ్డి అరెస్ట్‌పైన కోర్టులో పోరాటం చేస్తుందని హామీ కేటీఆర్(KTR) ఇచ్చారు.
KTR Comment
మరో వైపు వికారాబాద్ డీటీసీ సెంటర్‌లో ఉన్న నరేందర్ రెడ్డి(Patnam Narender Reddy)ని కలిసేందుకు మాజీ ఎమ్మెల్యేలు మహేష్ రెడ్డి, ఆనంద్‌ను పోలీసులు అనుమతించారు. అయితే మీడియాకు మాత్రం అనుమతి నిరాకరించారు. నరేందర్ రెడ్డిని కలిసిన అనంతరం పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. లగచర్లలో జరిగిన సంఘటనపై కలెక్టర్‌నే స్వయంగా దాడి జరగలేదన్నారని తెలిపారు. రైతుల భూములను గుంజు కోవాలనే అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అరెస్ట్ అక్రమమన్నారు. ప్రజా ప్రతినిధులకు ఎందరో ఫోన్లు చేస్తుంటారని… నరేందర్ రెడ్డితో ఫోన్ మాట్లాడిండనే కారణం చూపడం అన్యాయమన్నారు. రైతులను కష్టపెట్టి… భయపెట్టి వారి భూములు గుంజుకోవాలని ప్రభుత్వం చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహారిస్తూ రైతులతో పాటు నాయకులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారన్నారు. నాయకులు ఫోన్ మాట్లాడితేనే కేసులు వేస్తే.. నాయకులనే వారు ఎవరూ మిగలరన్నారు. అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తున్నామని… నరేందర్ రెడ్డి అక్రమ అరెస్ట్‌ను కోర్టులో తేల్చుకుంటామని మహేష్ రెడ్డి స్పష్టం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహారిస్తూ అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ వ్యాఖ్యలు చేశారు. నాయకులతో మాట్లాడిన వారందరినీ జైలుకు పంపిస్తే ఎంత మందిని పంపిస్తారని ప్రశ్నించారు. ఎంతోమందిని అరెస్ట్ చేసి అక్రమ కేసులు నమోదు చేసినా బీఆర్ఎస్ పోరాటం ఆగదన్నారు. కాంగ్రెస్ నాయకుల కాల్ డేటాను కూడా తీస్తే ఎవరు ఎవరితో మాట్లాడారో తెలుస్తుందన్నారు. ‘‘పరిశ్రమలు పెట్టండి… కానీ రైతులను ఒప్పించి పట్టాలి’’ అని అన్నారు. బీఆర్ఎస్ పరిశ్రమలకు వ్యతిరేకం కాదని… కాలుష్యం లేని పరిశ్రమలు పెట్టాలని డిమాండ్ చేశారు. రైతులను ఒప్పించి రైతుల భూములు తీసుకోవాలన్నారు. అక్కడున్న రైతులంతా వ్యవసాయం చేసుకునే వారని తెలిపారు. రైతులకు వ్యతిరేకంగా ఉండడంతోనే సమావేశానికి వెళ్లలేదన్నారు. ఇదంతా పోలీస్.. ప్రభుత్వ వైఫల్యమే అంటూ వ్యాఖ్యలు చేశారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడమని.. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం బట్టలూడదీసి బజారున నిలబెడుతామని మెతుకు ఆనంద్ హెచ్చరించారు.
మరో వైపు లగచర్ల అధికారులపై దాడి ఘటనలో మరో నలుగురిని రిమాండ్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. నలుగురు నిందితులకు పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మళ్ళీ పరిగి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఫార్మాలిటిస్ పూర్తవ్వగానే కోడంగల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు పోలీసులు ఏర్పట్లు చేస్తున్నారు.
Also Read : Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు