Deputy CM : తల్లిదండ్రులు తమ పిల్లలకు తమిళ పేర్లు పెట్టాలి – ఉదయనిధి స్టాలిన్
ఆదర్శ వివాహాలను ద్రావిడ సంస్థలు ప్రోత్సహించాయని, అప్పటి నుంచి ఈ వివాహాలు జరుగుతున్నాయన్నారు...
Deputy CM : తల్లిదండ్రులు తమ పిల్లలకు తమిళంలో పేర్లు పెట్టాలని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Udhayanidhi Stalin) పిలుపునిచ్చారు. గురువారం తూత్తుకుడి జిల్లా పర్యటన కోసం ఆయన బుధవారం సాయంత్రం విమానంలో తూత్తుక్కుడి చేరుకుని, రాత్రి అక్కడే బస చేశారు. ఆ తర్వాత గురువారం జిల్లాలో అధికారులు ఏర్పాటు చేసిన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి, పూర్తయిన అభివృద్ధి పనులను ప్రారంభించారు.
Deputy CM Udhayanidhi Stalin Comment
ఆదర్శ వివాహాలను ద్రావిడ సంస్థలు ప్రోత్సహించాయని, అప్పటి నుంచి ఈ వివాహాలు జరుగుతున్నాయన్నారు. ఆలయాల్లో కూడా తమిళంలో అర్చన చేయాలని ద్రావిడ సంస్థలు ఒత్తిడి చేయడం వల్లే అమల్లోకి వచ్చిందని గుర్తు చేశారు. మహిళలకు ఆస్తి హక్కులో సమాన వాటా కల్పించింది కూడా తమ పార్టీయేనని చెప్పా రు. తల్లిదండ్రులకు ఆయన ఒక విఙ్ఞప్తి చేశారు. తమ పిల్లలకు తమిళంలో పేర్లు పెట్టాలని, ప్రతి ఒక్కరూ ఈ పని చేస్తే ఎంతో సంతోషంగా ఉంటుందన్నారు.
అనంతరం తూత్తుకుడి తహ సీల్దార్ కార్యాల యంలో ఉదయనిధి తనిఖీలు చేశారు. అనంతరం కలెక్టరేట్‌లో వివిధ ప్రభుత్వ పథకాలపై సమీక్ష జరిపారు. రూ.206.46 కోట్ల విలువైన సహాయాలను లబ్ధి దారులకు అందచజేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు గీతాజీవన్, అనిత ఆర్.రాధాకృష్ణన్, ఎమ్మెల్యేలు మార్కండేయన్, షణ్ముగయ్య, ఊర్వశి, అమృతరాజ్, కార్పొరేషన్ మేయర్ జగన్ పెరియస్వామి, స్పెషల్ స్కీమ్స్ సెక్రటరీ థారేస్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : IPL 2025 : ఐపీఎల్ వేలానికి ముందే ‘కెఎల్ రాహుల్’ కు ఊహించని వరం