MLA Harish Rao : సీఎం రేవంత్ సర్కార్ వాస్తవాలను తొక్కి పెడుతుంది
మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతోందని మండిపడ్డారు...
Harish Rao : ప్రజలనే కాదు.. పార్లమెంట్‌ను సైతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేశారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తీన్నీరు హరీష్‌రావు ఆరోపించారు.ఇవాళ(గురువారం) తెలంగాణ భవన్లో హరీష్‌రావు(Harish Rao) మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. మల్లన్నసాగర్లో తాను భూములు ఆక్రమిస్తే విచారణ జరిపించాలి. ప్రభుత్వం రేవంత్ చేతిలోనే ఉందని సవాల్ విసిరారు. మూసీపై సీఎంతో బహిరంగ చర్చకు సిద్ధం.. ఎక్కడకు రావాలో చెప్పాలని సవాల్ విసిరారు. మూసీపై అఖిలపక్షానికి సిద్ధంగా ఉన్నామని.. కానీ అఖిలపక్షాన్ని చర్చలకు పిలుస్తానన్నముఖ్యమంత్రి తోక ముడిచారని హరీష్‌రావు ఎద్దేవా చేశారు.
MLA Harish Rao Slams..
మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతోందని మండిపడ్డారు. కేంద్రాన్ని, పార్లమెంట్‌ను రేవంత్(CM Revanth Reddy) ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని అన్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తున్నామని పార్లమెంట్‌కు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని అన్నారు. రేవంత్‌కు సోనియాగాంధీపై ప్రేమ, గౌరవముంటే.. యూపీఏ ప్రభుత్వం తెచ్చిన 2013భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే మూసీ ప్రాజెక్టు చేపట్టారని ఆరోపించారు.రేవంత్‌పై పార్లమెంట్లో ప్రివిలేజ్ మోషన్‌కు మూవ్ చేస్తామని అన్నారు. మూసీపై ప్రభుత్వాన్ని బాధితుల పక్షాన శాసనసభలో నిలదీస్తామన్నారు. 2014 భూసేకరణ చట్టం ప్రకారం.. మల్లన్నసాగర్, కొండపోచమ్మ నిర్వాసితులకు పరిహారం చెల్లించామని గుర్తుచేశారు. కట్టిన ఇళ్లను కూల్చమంటున్నారు సరే.. హైడ్రా కూల్చిన ఇళ్ల సంగతి ఏంటని ప్రశ్నించారు. రేవంత్ ప్రభుత్వం చేసిన పాపానికి శిక్ష ఎవరికి వేయాలని నిలదీశారు. ఇప్పటికే కూల్చిన ఇళ్లకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మూసీ బాధితులను కేసీఆర్ ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లల్లోకి నెట్టి.. రేవంత్ గొప్పలు చెబుతున్నారని హరీష్‌రావు(Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా..రంగనాయక్ సాగర్ దగ్గర హరీశ్‌రావు ఇరిగేషన్ భూములు ఆక్రమించాడంటూ ముఖ్యమంత్రి నిరాధార ఆరోపణలు చేశారని హరీశ్ రావు ధ్వజమెత్తారు. తాను నిబంధనలకు లోబడి ధరణి ద్వారా భూమిని కొనుగోలు చేశానని, ఒక్క గుంట కూడా ఆక్రమించలేదని స్పష్టం చేశారు. తనపై ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రికి వాటిని నిరూపించాల్సిన బాధ్యత ఉందని, ఆయన ఎప్పుడు వస్తారో చెబితే తాను ఆ భూమి వద్దకు వస్తానని సీఎం రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు. ప్రాజెక్టుల కోసం సేకరించిన భూమిని బదలాయించుకుని హరీశ్‌రావు రంగనాయక సాగర్‌లో ఫామ్‌హౌస్ నిర్మించారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.సీఎం ఆరోపణలపై హరీస్‌రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఒక్క గుంట భూమి ఆక్రమించినట్టు తన చరిత్రలోనే లేదని, ఆక్రమణల చరిత్ర ముఖ్యమంత్రికే ఉందంటూ ధ్వజమెత్తారు. ఆక్రమణలలో మునిగితేలే రేవంత్ రెడ్డికి అందరూ దొంగల్లానే కనిపిస్తారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ను అమలు చేయలేక ప్రతిపక్షంపై నిందలు వేస్తూ రేవంత్ కాలం గడుపుతున్నారని ఆరోపించారు.11 నెలల కాలంలో సీఎం, ఆయన మంత్రులు చేసిందేమీ లేదని విమర్శించారు. లోపాలను ఎత్తిచూపుతున్న కేటీఆర్‌పై కేసులు పెట్టే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
Also Read : Minister Seethakka : గిరిజన హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ వెనుక పెద్ద కుట్ర ఉంది