CM Chandrababu : ఏపీని నాలెడ్జ్ హబ్ చేయడానికి అందరూ ముందుకు రావాలి

ఒక్కప్పుడు ఆహార ధాన్యాలు కంటే మొబైల్ ఫోన్ గొప్పదా అని ప్రశ్నించారని....

CM Chandrababu : ‘‘డీప్‌ టెక్నాలజీ సదస్సు-2024’’లో స్వర్ణ ఆంధ్ర ట్రాన్స్ఫామేషన్ ఇండియా టూ వికసిత భారత్ , ఏఐ ఫర్ ఎవరీ వన్ అనే రెండు పుస్తకాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu) శుక్రవారం ఆవిష్కరించరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. 1995లోనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నామని.. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ మోడల్స్ కూడా అప్పుడే తీసుకువచ్చామన్నారు. అప్పుడు ప్రారంభించిన ఐటీ టవర్ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారని తెలిపారు. ఇండియా ఒక స్ట్రెంత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని.. గతంలో హ్యూమన్ రిసోర్స్ పట్ల చాలా పూర్‌గా ఉండేవాళ్లమన్నారు. అగ్రికల్చర్ విప్లవం, పారిశ్రామిక విప్లవం, టెక్నిలజి విప్లవం వచ్చిందని.. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పెరిగాయన్నారు.

CM Chandrababu Comment

ఒక్కప్పుడు ఆహార ధాన్యాలు కంటే మొబైల్ ఫోన్ గొప్పదా అని ప్రశ్నించారని.. కానీ ఇప్పుడు మొత్తం మొబైల్ ఫోన్ చుట్టూనే తిరుగుతోందన్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీతో సహా అనేక టెక్నాలజీ వచ్చాయన్నారు. ప్రధాని మోదీ కూడా డిజిటల్ టెక్నాలజీ పెంచుతున్నారన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ను నాలెడ్జి హబ్‌గా చేయడానికి అందరూ అడుగులు కలపాలని పిలుపునిచ్చారు. 15% జీడీపీ పెరగాలని లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు. దేశ జీడీపీ 8 శాతం ఉంటే ఆంధ్ర ప్రదేశ్ 8.7 శాతం అభివృద్ధి ఉందన్నారు. ప్రతి మూడు నేలలకు పరిశీలన చేస్తున్నామని చెప్పారు. ఒక్కప్పుడు జనాభా నష్టం అనుకున్నామని.. కానీ ఇప్పుడు అదే మన ఆస్తి అన్నారు. ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరి మన భారతీయుడు ఉన్నారని తెలిపారు.

ప్రపంచంలోఅన్ని దేశాలు జనాభా తక్కువ సమస్యను ఎదుర్కొంటున్నారన్నారు. జనాభా- టెక్నాలజీ రెండు అవసరమన్నారు. ఫోర్ పి.. స్లోగన్‌తో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. విశాఖ నగరం భవిష్యత్ నాలెడ్జ్ హబ్ అన్నారు. జీరో బడ్జెట్ నేచురల్ ఫ్రామింగి డెవెలప్‌మెంట్ నినాదంతో వెళ్తున్నామన్నారు. వెయ్యి కిలోమీటర్లు తీరం ఉందని.. సముద్ర రవాణా మీద బాగా దృష్టి పెట్టామన్నారు. లాజిస్టిక్ కార్గోకు కేవలం 14 % ఉందని…మన రాష్ట్రమే మొదటి విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు. పవర్ సెక్టార్‌లో రాష్ట్రం మంచి అభివృద్ధి సాధించిందన్నారు. త్వరలో గ్రీన్ హైడ్రోజిన్ కూడా ఏపీ నుంచి ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Also Read : Rajya Sabha : గందరగోళంగా మారిన రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ సీటుకింద నోట్ల కట్ట

Leave A Reply

Your Email Id will not be published!