Rohit Sharma : అడిలైడ్ టెస్ట్ ఓటమిపై స్పందించిన భారత్ కెప్టెన్ ‘రోహిత్ శర్మ’

అడి లైడ్టెస్ట్ ఓటమికి ఏ ఒక్కర్నో బాధ్యుల్ని చేయలేమన్నాడు రోహిత్...

Rohit Sharma : అడిలైడ్ టెస్ట్ ఓటమిని టీమిండియా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. మొదటి మ్యాచ్‌లో అదరగొట్టిన టీమ్.. ఇంత దారుణంగా ఆడటం ఏంటని షాక్ అవుతున్నారు. కనీసం పోరాడకుండా పసికూన మాదిరి ఆడటం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. ఓడిపోయినా ఫర్వాలేదు గానీ డ్రా చేయాలనో లేదా చివరి క్షణం వరకు ఫైట్ చేస్తూ ఆసీస్‌ను ముప్పుతిప్పలు పెట్టాలనే కసి మన జట్టులో కనిపించకపోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇంత ఈజీగా కంగారూల ముందు సరెండ్ అవడాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఈ తరుణంలో పింక్ బాల్ టెస్ట్ ఓటమిపై కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వాళ్ల వల్లే ఓడామన్నాడు.

Rohit Sharma Comment

అడి లైడ్టెస్ట్ ఓటమికి ఏ ఒక్కర్నో బాధ్యుల్ని చేయలేమన్నాడు రోహిత్(Rohit Sharma). జట్టు సమష్టిగా విఫలమైందన్నాడు. బ్యాటర్లు, బౌలర్లు ఫెయిల్ అయ్యారని.. అందుకే పరాజయం పాలయ్యామన్నాడు. బ్యాటింగ్ ఫెయిల్యూర్ టీమ్ కొంపముంచిందన్నాడు. ‘ఈ మ్యాచ్‌లో మేం సరిగ్గా బ్యాటింగ్ చేయలేదు. ఎక్కువ రన్స్ చేయలేమనే విషయం మాకు తెలుసు. కానీ పెర్త్ టెస్ట్ మాదిరిగా సిచ్యువేషన్స్ కలిసొస్తే భారీగా పరుగులు సాధిస్తామని అనుకున్నాం. అది కుదర్లేదు. అయితే చిన్న విషయాలకు టెన్షన్ పడటం లేదు. ఆసీస్ మా కంటే బాగా ఆడింది. బ్రిస్బేన్ టెస్ట్‌లో పుంజుకోవడం మీద ఫోకస్ పెడుతున్నాం’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

పింక్బాల్ టెస్ట్‌లో బ్యాటింగ్ విభాగంలో ప్రతి ఒక్కరు పరుగులు చేయడానికి ప్రయత్నించారని.. కానీ వర్కౌట్ కాలేదన్నాడు హిట్‌మ్యాన్. కొన్నిసార్లు ఎంతగా ప్రయత్నించినా సాధ్యం కాదన్నాడు. బ్రిస్బేన్‌లో తడాఖా చూపిస్తామన్నాడు. ఏ ప్లేయర్‌ను ఎలా వాడుకోవాలనేది తనకు బాగా తెలుసునని రోహిత్ వ్యాఖ్యానించాడు. ఏ ఒక్కరి మీదో ఆధారపడలేదని.. జట్టు కూర్పులో వైవిధ్యత ఉండేలా చూసుకుంటున్నామని పేర్కొన్నాడు. అందరూ బాధ్యత తీసుకొని ఆడితే మెరుగైన ఫలితాలు ఉంటాయని రోహిత్ వివరించాడు. పేసర్ బుమ్రాపై పని ఒత్తిడి తగ్గించాలని అనుకుంటున్నామని తెలిపాడు. దీనిపై టీమ్ మేనేజ్‌మెంట్‌లో డిస్కషన్స్ జరుగుతున్నాయని చెప్పుకొచ్చాడు. సీనియర్ స్పీడ్‌స్టర్ మహ్మద్ షమి కోసం జట్టు తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నాడు హిట్‌మ్యాన్. అయితే అతడ్ని ఒత్తిడి పెట్టబోమన్నాడు.

Also Read : Minister Seethakka : కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై సీతక్క భావోద్వేగం

Leave A Reply

Your Email Id will not be published!