Rahul Gandhi : ఆ అంశంపై కీలక నిర్యాణంకై కాంగ్రెస్ ఎంపీలతో రాహుల్ గాంధీ భేటీ

రాజ్యాంగంపై చర్చ సందర్భంగా హోం మంత్రి అమిత్ షా రెండు రోజుల క్రితం రాజ్యసభలో ప్రసంగిస్తూ....

Rahul Gandhi : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అలాంటి వేళ లోక్ సభలో అనుసరించ వలసిన వ్యూహంపై ప్రతిపక్షాలు సమాయత్తమయ్యాయి. అందులో భాగంగా గురువారం ఉదయం న్యూఢిల్లీలోని లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) నేతృత్వంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి హాజరైన ఎంపీలో రాహుల్ గాంధీ(Rahul Gandhi) చర్చిస్తున్నారు. అయితే అంబేద్కర్ విగ్రహం నుంచి పార్లమెంట్ మకర్ ద్వార్ వరకు మార్చ్ నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

Rahul Gandhi Meet

రాజ్యాంగంపై చర్చ సందర్భంగా హోం మంత్రి అమిత్ షా రెండు రోజుల క్రితం రాజ్యసభలో ప్రసంగిస్తూ.. అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్.. అని ఇన్ని సార్లు భగవంతుడి పేరు తలచుకొంటే ఏడేడు జన్మలు వారికి స్వర్గంలో స్థానం లభించేదన్నారు. అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. హోం మంత్రిగా అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. అమిత్ షా వ్యాఖ్యలను ప్రధాని మోదీ సమర్థించే ప్రయత్నం చేశారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ను ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అవమానించిందో హోం మంత్రి అమిత్ షా వెల్లడించారంటూ ప్రధాని మోదీ.. తన ఎక్స్ వేదికగా వరుసగా వివరించారు. అందుకే హోం మంత్రి చెప్పిన వాస్తవాలు చూసి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఉల్కిపడిందన్నారు. అందులోభాగంగానే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అసలు విషయాలు ప్రజలకు తెలుసునని ఈ సందర్భంగా మోదీ తన ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించారు.

ఈ నేపథ్యంలో అమిత్ షా వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు నిరసన బాట పట్టాయి. అందులోభాగంగా బుధవారం పార్లమెంట్ వద్ద అంబేద్కర్ చిత్ర పటాలతో ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు నిరసన చేపట్టిన విషయం విధితమే. అలాగే ఈ రోజు సైతం అమిత్ షా వ్యాఖ్యలపై నిరసన చేపట్టాలని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో కలిసి రాహుల్ గాంధీ మార్చ్ నిర్వహించనున్నారు. మరోవైపు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రేపటితో అంటే.. డిసెంబర్ 20వ తేదీతో ముగియనున్నాయి.

Also Read : MLA KTR : జానపద గాయకుడు మొగిలయ్య మృతిపై సంతాపం తెలిపిన కేటీఆర్

Leave A Reply

Your Email Id will not be published!