Minister Gottipati : పల్నాడు జిల్లా దాచేపల్లి సమీపంలో జరిగిన ప్రమాదంపై మంత్రి ఆరా
పల్నాడుజిల్లా, దాచేపల్లి సమీపంలో ఆదివారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది...
Minister Gottipati : అద్దంకి- నార్కట్‌పల్లి హైవే పై ఆదివారం తెల్లవారు జామున జరిగిన ప్రమాదంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరా తీశారు. దాచేపల్లి వద్ద ట్రావెల్ బస్సు దూసుకెళ్లి 150 గొర్రెలు మృతి చెందిన ఘటనపై మంత్రి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గొర్రెల కాపరికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. ఈ ఘటనపై కలెక్టర్, ఎస్పీలతో మంత్రి గొట్టిపాటి(Minister Gottipati) ఫోన్లో మాట్లాడారు.
గొర్రెల కాపరులకు న్యాయం చేస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్(Minister Gottipati) భరోసా ఇచ్చారు. దాచేపల్లి వద్ద ఘోర ప్రమాదం జరిగింది. పులిపాడు నుంచి దాచెపల్లి వైవు వెళుతున్న గొర్రెల మందను హైదరాబాద్ నుంచి గుంటూరు వెళుతున్న ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో 150 గొర్రెలు అక్కడిక్కడే మృతి చెందాయి. గొర్రెల మందకు కాపలా ఉన్న వ్యక్తిని కూడా ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గొర్రెల కాపరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న దాచేపల్లి పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జరిగిన ప్రమాదంపై దాచేపల్లి పోలీసులు కేసు నమోదు చేపుకుని దర్యాప్తు చేపట్టారు.
Minister Gottipati Investigate
పల్నాడుజిల్లా, దాచేపల్లి సమీపంలో ఆదివారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి గుంటూరు వస్తున్న శ్రీ మారుతీ ట్రావెల్స్ బస్సు గొర్రెల మందవైపు దూసుకు వెళ్లింది. 4 వందల గొర్రెలతో వెళుతున్న మందపైకి బస్సు దూసుకుపోయింది. విషయం తెలుసుకున్న స్థానికులు, గొర్రెల కాపరి కుటుంబ సభ్యులు సంఘటన ప్రదేశానికి చేరుకుని తమకు న్యాయం చేయాలని దాచేుపల్లి సెంటర్‌లో రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ప్రస్తుతం అద్దంకి, నార్కెట్ పల్లి హైవేపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది.
వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.దీంతో పల్నాడు జిల్లా ఎస్‌పి శ్రీనివాస్ సంఘటన ప్రదేశానికి చేరుకుని.. బాధితులతో మాట్లాడినప్పటికీ కూడా వారు ఆందోళన విరమించలేదు. కాగా ప్రమాదం చేసిన ట్రావెల్స్ డ్రైవర్ బస్సును సంఘటన ప్రదేశంలో వదిలేసి పారిపోయాడు. దీంతో పోలీసులు ట్రావెల్స్ యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతున్నారు. తమకు న్యాయం చేసే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని గొర్రెల కాపరులు, బాధితుడి కుటుంబసభ్యులు ఆందోళన కొనగిస్తున్నారు. ఈ క్రమంలో అద్దంకి, నార్కెట్ పల్లి వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Also Read : MLA KTR : సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన మాజీ మంత్రి కేటీఆర్