Mahakumbh Mela-Trains : 4 రైళ్లను దారి మళ్లించిన దక్షిణ మధ్య రైల్వే
Trains : మహా కుంభమేళాకు వెళ్లే భక్తుల సౌలభ్యం కోసం వివిధ మార్గాల్లో నడిచే 4 ఎక్స్‌ప్రెస్ రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది. నేటి నుంచి ఈనెల 28వరకు సికింద్రాబాద్-దానాపూర్-సికింద్రాబాద్(Secunderabad-Danapur-Secunderabad మార్గంలో నడిచే రెండు రైళ్లు((12791/12792) మాణిక్పూర్, ప్రయాగ్‌రాజ్ చోకీ, మీర్జాపూర్, పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మీదుగా నడవనున్నాయి.
Trains Updates..
అలాగే, 18నుంచి 25వరకు ఎర్నాకుళం-పాట్నా-ఎర్నాకుళం మార్గంలో నడిచే మరో రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు (22669/ 22670) కూడా ఇదే మార్గంలో దారి మళ్లించి మాణిక్పూర్, ప్రయాగ్‌రాజ్ చోకీ, మీర్జాపూర్, పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మీదుగా వెళ్లి వస్తాయని సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు.
Also Read : Prashant Kishor : జన్ సూరజ్ క్యాంప్ లో తన దీక్ష విరమించుకున్న పీకే